అఖిల్ సినిమాలో హీరోయిన్ గా ఎంపిక అయి ఇంకా తాను నటించవలసిన షూటింగ్ కూడా షురూ కాకుండానే సయేషా కి టాలీవుడ్ లో పెరిగిన క్రేజ్ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. అక్కినేని అమల చేత నేచురల్ బ్యూటీ అని బహిరంగంగా పొగడ్తలు అందుకున్న ఈ బాలీవుడ్ బ్యూటీ పై మెగా కన్ను పడినట్లుగా వార్తలు వస్తున్నాయి.
ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం అల్లుఅర్జున్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో త్వరలో నటించబోతున్న సినిమాలో ఈమెను హీరోయిన్ గా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. అయితే అఖిల్ సినిమాలో ఈమెను పెట్టుకునే ముందు అక్కినేని కాంపౌండ్ ఈమెతో ఒక ఎగ్రిమెంట్ చేసుకుంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో అఖిల్ సినిమా పూర్తి అయి విడుదల కాకుండా ఈమెను మరో సినిమాలో నటించడానికి అక్కినేని కాంపౌండ్ అంగీకరిస్తుందా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి.
అఖిల్ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈమెను చూసిన చాల మంది దర్శక నిర్మాతలు సయేషా రాబోయే కాలంలో టాలీవుడ్ కు హీరోయిన్స్ కొరత తీర్చే టాప్ హీరోయిన్ గా మారుతుందని కామెంట్లు చేసుకున్నట్లుగా వార్తలు కూడా ఉన్నాయి.
దీనికి తోడు మెగా యంగ్ హీరోల దృష్టి కూడా ఈమె పై పడటంతో అక్కినేని నాగార్జున, వినాయక్ లు అంగీకరిస్తే సయేషా కు మెగా కాంపౌండ్ ఎంట్రీతో పాటు మరో రెండు, మూడు భారీ సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అని అంటున్నారు. మరి నాగ్ నిర్ణయం ఏమిటో చూడాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79340/MEGA-TARGET-ON-AKHIL-HEROINE/

0 comments:
Post a Comment