మొన్న విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘టెంపర్’ కు రెండవ రోజున ఇరు రాష్ట్రాలలోను ఊహించని షాక్ తగిలి నట్లుగా వార్తలు వస్తున్నాయి. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా 9 కోట్ల 70 లక్షలు కలెక్ట్ చేసి టాలీవుడ్ సినిమాలకు సంబంధించి టాప్ 10 ఫస్ట్ డే కలెక్షన్ ఫిలిమ్స్ లో మూడో స్థానంలో నిలిచింది టెంపర్. అంతేకాదు ఈటాప్ 10 లిస్ట్‌లో 4 సినిమాలున్న ఏకైక స్టార్‌గా ఎన్టీఆర్ ను నిలబెట్టింది ఈ ‘టెంపర్’. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ సినిమాకు రెండవ రోజు అనుకోని షాక్ తగిలింది అని వార్తలు వస్తున్నాయి.
దీనికి ప్రధాన కారణం నిన్నటి నుంచి ప్రారంభమైన క్రికెట్ ఫీవర్ అని అంటున్నారు. ఈరోజు జరగబోతున్న ఇండియా, పాకిస్తాన్ వరల్డ్ కప్ మ్యాచ్ గురించి నిన్న చాల ఛానల్స్ విశ్లేషణలతో కూడిన కార్యక్రమాలు ప్రసారం చేయడంతో బుల్లితెర పై ఆ కార్యక్రమాలను చూస్తూ యూత్ ‘టెంపర్’ వద్దకు వెళ్ళడం కొద్దిగా తగ్గించారు అని తెలుస్తోంది. దీనితో ‘టెంపర్’ కు ఇరు రాష్ట్రాలలోను కొన్ని షోలకు 60 శాతం మాత్రమే ఫుల్ కలెక్షన్స్ వచ్చాయని అనే మాటలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా భాగ్యనగరంలోని సివారు ప్రాంతాలలో ఈ సినిమా ప్రదర్శింప బడుతున్న సెకండ్ షోకు జనం తక్కువగా వచ్చారని టాక్.
అంతేకాదు నిన్న అఖిల్ సినిమాకు సంబంధించి శిల్పకళారామంలో జరిగిన ఫంక్షన్ ను కొన్ని ఛానల్స్ ప్రత్యక్ష ప్రసారం చేయడంతో ఆ ప్రభావం కూడా ‘టెంపర్’ పై ఉంది అని అంటున్నారు. ఇక ఈరోజు మరి కొద్ది సేపటిలో ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ వార్ ప్రారంభం కాబోతున్న నేపధ్యంలో ఈరోజు దీని ప్రభావం ‘టెంపర్’ పై గట్టిగానే ఉండబోతోంది అని టాక్.
అదేవిధంగా ఇంకా సగంపైగా నందమూరి ఫ్యాన్స్ తెలుగుదేశం, యూత్ కేడర్ 'టెంపర్'ను పట్టించుకోవడం లేదని ఫిలింనగర్ ఇన్‌సైడ్ న్యూస్. దీనితో ‘టెంపర్’ సూపర్ హిట్ అయినా ఏ రేంజ్ కలక్షన్స్ ఈ సినిమా వసూలు చేస్తుంది అన్న విషయం పై విశ్లేషకులు కూడా స్పష్టంగా చెప్పలేక పోతున్నారు అనే మాటలు వినిపిస్తున్నాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78775/TEMPER-GOT-UNEXPECTED-SCHOCK/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.