March 13, 2025 11:50:27 AM Menu
Latest

6:28 PM test1

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన మూవీ టెంపర్. ప్రస్తుతం టెంపర్ మూవీకి సంబంధించిన బాక్సాపీస్ టాక్స్ అన్ని చోట్ల నుండి హాట్ టాపిక్ గా వినిపిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల తరువాత నందమూరి ఎన్టీఆర్ కి అసలైన హిట్ వచ్చిందని ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళితే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన టెంపర్ మూవీ, ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లోనూ దుమ్ము రేపుతుంది.

ఎటువంటి దయా లేని 100% కన్నింగ్, కరప్టట్డ్ పోలీస్ ఆఫీసర్ గా లైన్ తీసుకొని వక్కంతం వంశీ రాసిన కథే టెంపర్ మూవీ. అవినీతికి కేరాఫ్ అడ్రస్ అయిన దయా, నీతిపరుడుగా ఎలా మారాడు అనేది సినిమా కధాంశం. ఈ కథని పూరి జగన్నాధ్ తనదైన శైలిలో దర్శకత్వం వహించాడు. మొత్తంగా మూవీ రిజల్ట్ ఇప్పుడు బాక్సాపీస్ ని షేక్ చేస్తుంది. అమెరికాలో రికార్డు కలెక్షన్స్ సాదించిన ఈ సినిమా ఇతర విదేశాలలో సైతం సరికొత్త రికార్డులు సృష్టిస్తుంది.

న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాలలో టెంపర్ బాక్సాపీస్ సత్తా చాటుతుంది. ఎన్టీఆర్ గత సినిమా కలెక్షన్స్ ను ‘టెంపర్’ సినిమా కేవలం రెండు రోజుల్లో అధిగమించింది. దుబాయ్, కువైట్ లలోనూ టెంపర్ చెప్పుకోదగ్గ కలెక్షన్స్ ని సాధిస్తుంది. అలాగే, యుకె తో పాటు యూరోప్ దేశాలలో మంచి వసూళ్లు సాదిస్తుంది.

మొత్తంగా ఓవర్సీస్ లో టెంపర్ బాక్సాపీస్ సత్తా చాటుతుంది. వీటికి సంబంధించిన కంప్లీట్ కలెక్షన్స్ రిపోర్ట్ ని త్వరలోనే మీకు అందిస్తాం. పరమేశ్వరా ఆర్ట్స్ పతాకంపై బ్లాక్ బస్టర్ నిర్మాత బండ్ల గణేష్ నిర్మించిన సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మూవీకి పాజిటివ్ గా మారింది.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78911/Ntr-sukumar-tollywood-rakhul-preeth-sings-ntr-film/
17 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top