ఈ సినిమాలో తనకు ఆఫర్ చేసిన పాత్ర స్వభావం పూర్తిగా విన్నాక స్వాతి తనకు పాత్ర బాగా నచ్చినా ఈ సినిమా దర్శకుడు అడిగిన డేట్స్ తన వద్ద లేవని ఆ డేట్స్ లలో తాను ఇప్పటికే ఒప్పుకున్న ఒక మలయాళ సినిమా చేయ వలసి ఉందని వినయంగా ఆ ఆఫర్ ను తిరస్కరించిందని వార్తలు వస్తున్నాయి.అయితే స్వాతికి నిజంగా డేట్స్ సమస్య వల్ల ఈ అవకాశాన్నివదులుకుందా లేదంటే తనకు వినిపించిన పాత్ర నచ్చలేదా అనే మాటకు కూడా ఉన్నాయి. అయితే నాగార్జున తీస్తున్న ఈ సినిమాకు సంబంధించి స్వాతికి ఆఫర్ చేసిన పాత్ర చాల ముఖ్యమైనది అని ఫిలిం యూనిట్ టాక్. అంతేకాదు కేవలం డేట్స్ కుదరక మాత్రమే స్వాతి ఈ అవకాశాన్ని వదులు కుంది అని అంటున్నారు.
దీనితో స్వాతి వద్దు అనుకున్న పాత్ర యాంకర్ అనసూయ ఇంట వాలిందని అంటున్నారు. ఎప్పటి నుంచో సినిమా అవకాశాల గురించి ఎదురు చూస్తున్న అనసూయ అనుకోకుండా తలుపు తట్టిన ఈ అదృష్టాన్ని ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా అంగీకరించిందని చెప్పిందని వార్తల హడావిడి వినిపిస్తోంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77203/ANASUYA-GOT-SWATHI-FORTUNE/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.