Menu

కమెడియన్ సప్తగిరి ఈమధ్య కాలంలో వచ్చిన హాస్య నటులలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఈ మధ్య అతడు నటించిన సినిమాలలోని హాస్య సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చడంతో రాబోతున్న కాలంలో ఇతడు టాప్ కమెడియన్ గా మారిపోతాడు అంటూ అప్పుడే ఇతడి పై కొందరు విశ్లేషణలు కూడా చేసేస్తున్నారు. ఈమధ్య కాలంలో టాలీవుడ్ లో చాలామంది కమెడియన్లు చనిపోవడంతో ఆ ఖాళి సప్తగిరికి అదృష్టంగా మారనున్నది అనే విశ్లేషణలు కూడా వినపడుతున్నాయి

ఈ వార్తలు ఇలా ఉండగా దర్శకుడు మారుతి సొంత నిర్మాణ సంస్థ గుడ్ సినిమా గ్రూప్ త్వరలో తీయబోయే ఒక సినిమాకు హీరోగా సప్తగిరిని ఎంపిక చేసారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే ఈసినిమాకు ‘ఆరడుగుల బుల్లెట్’ అనే టైటిల్ పెడితే మంచి క్రేజ్ వస్తుందని మారుతి ఆలోచన అని అంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ ఎంపరర్ గా మార్చిన ‘అత్తారింటికి దారేది’ పాటలోని ఈ పవర్ ఫుల్ పదాన్ని సప్తగిరికి వాడితే జనం సహిస్తారా అనే అనుమానం కూడా ఉంది.

అదీ కాకుండా ఈ టైటిల్ ను ‘అత్తారింటికి దారేది’ సినిమాను నిర్మించిన ప్రసాద్ ఇప్పటికే రిజిస్టర్ చేసి ఉంచడంతో ఈ టైటిల్ ను అంత సులువుగా నిర్మాత ప్రసాద్ దర్శకుడు మారుతికి ఇస్తాడా అనే అనుమానం కూడా చాలామందికి ఉంది. ఈ టైటిల్ ను మెగా కుటుంబానికి చెందిన ఏ హీరోకి అయినా వాడితే మెగా అభిమానులు సహిస్తారు కాని ఒక కమెడియన్ కు వాడితే అది ఎంత వరకు మెగా అభిమానులు సహనాన్ని చూపుతారు అనే మాటలు కూడా వినపడుతున్నాయి.

అయితే ఈ సినిమాకు మారుతి దర్శకత్వం వహిస్తాడా లేదంటే మరో కొత్త దర్శకుడు దర్శకత్వం వహిస్తాడా అన్న విషయం పై క్లారిటీ లేదు. త్వరలోనే ఈ ప్రశ్నలు అన్నిటికి సమాధానం దొరుకుంది అని అంటున్నారు.

sourcr:http://www.apherald.com/Movies/ViewArticle/77198/SAPTAGIRI-EXPERIMENT-ON-PAVAN-IMAGE/

0 comments:

Post a Comment

 
Top