Menu

rajinikanth-in-robo-sequel

‘ఐ’ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పోయినా విడుదల అయిన రెండు వారాలలో 18o కోట్ల కలెక్షన్ మార్కును అందుకోవడంతో శంకర్ ఫెయిల్యూర్ టాక్ ను కూడా సక్సస్ గా మార్చుకోగల మేధావి అంటూ కోలీవుడ్ మీడియా కామెంట్స్ రాస్తోంది. దీనితో శంకర్ త్వరలో ప్రారంభించబోయే సినిమాల పై ఊహగానలు స్పీడ్ అందుకున్నాయి.

రకరకాల హీరోల కాంబినేషన్ తో వార్తలు వచ్చిన తరువాత ఈరోజు ఉదయం నుండి కోలీవుడ్ మీడియాలో వస్తున్న వార్తలు అందరికి షాకింగ్ గా మారాయి. ఇప్పటికే ‘ఐ’ మూవీ నిర్మాతలకు లాస్ లేకపోయినా ఇంకా ఈ సినిమా బయ్యర్లు పూర్తిగా నష్టాల నుండి తేరుకోని నేపధ్యంలో శంకర్ మరో ప్రయత్నం చేయబోతున్నాడు అంటూ వార్తలు రావడమే కాకుండా ఆ ప్రయత్నానికి సంబంధించిన ముహూర్తం కూడా పెట్టేసింది కోలీవుడ్ మీడియా.

శంకర్ రజినీకాంత్ ల కాంబినేషన్ లో ‘రోబొ 2’ సీక్వెల్ కు రంగం సిద్ధం అయిందని, అదేవిధంగా ఈ సినిమా సీక్వెల్ ఫస్ట్ లుక్ 14న వచ్చేస్తోందంటూ కోలీవుడ్ మీడియాలో విపరీతమైన వార్తల హడావిడి జరుగుతోంది. అంతేకాదు ఈ సినిమాలోని రజినీకాంత్ లుక్ కు సంబంధించి డిజైనింగ్ కూడా జరిగి పోతోందని కోలీవుడ్ కోడై కూస్తోంది.

ఎప్పుడూ లేని విధంగా గత సంవత్సరం రెండు భారీ సినిమాలలో నటించినా తన అభిమానులను మెప్పించలేక పోవడంతో రజినీకాంత్ శంకర్ కు ‘రోబొ2’ సీక్వెల్ కు రజినీ లైన్ క్లియర్ చేయడమే కాకుండా ఇదే సంవత్సరం విడుదల చేసి తన అభిమానుల నిరాశను తీర్చాలని దృఢ నిశ్చయంతో ఉన్నాడు అని వార్తల హడావిడి.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77507/SHOCKING-NEWS-ON-ROBO-SEQUEL/

0 comments:

Post a Comment

 
Top