Menu

brahmanandam interview speach
నిన్న ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్‌వ్యూ లో, తనపై తాను శెటైర్ వేసుకున్నాడు మన హాస్య బ్రహ్మ 'బ్రహ్మానందం'. అసలు విషయం ఏమిటంటే, గిన్నిస్ బుక్ లో తనకు స్తానం లభించే విధంగా వచ్చిన తన క్రేజ్ ,తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ బొర్ .అనిపించదని చెబుతూ 'కొత్త నీళ్ళు వచ్చి పాత నీళ్ళు పోతుంటాయి, కానీ గట్తుకు ఉన్న పాచి మాత్రం ఎప్పుడూ అలానే ఉంటుంది' అంటూ తనను ఏ కొత్త హాస్య నటుడూ మరిపించ లేడని తనపై తాను షాకింగ్ కామెంట్స్ వేసుకున్నాడు బ్రహ్మానందం. భగవంతుడు తనను ఈ ప్రపంచాన్ని నవ్వించడానికే పుట్టించాడని ,అది తన తల్లి దండ్రులు ముందే ఊహించి తనకు 'బ్రహ్మానందం(విశ్వానికి ఆనందాన్ని ఇచ్చేవాడు)' అని అర్దం వచ్చేలా పేరును పెట్టారని బ్రహ్మానందం అభిప్రాయపడ్డాడు. అంతే కాకుండా, ఒకసారి త్రివిక్రమ్ శ్రీనివాస్ తనతో మాట్లాడుతూ ,భగవంతుని దర్శనం కోసం క్యూ లో గంటలు గంటలు నుంచుని, ఆ దేవుడిని చూశాక ఎంతటి ఆనందానికి లోనవుతమో, ప్రేక్షకులు తనని వెండి తెరపై చూసినప్పుడు కూడా అంతే ఆనందం పోందుతారు అని పొగిడినప్పుడు, తనకు ఆనందం కలగటమే కాకుండా, భగవంతుడు తనచే చేయిస్తున్న ఈ పాత్రను సమర్ధవంతంగా పోషిస్తున్నాను అనే అభిప్రాయం కలిగింది అని అన్నాడు. ఇంకా తన అభిప్రాయాలను పంచుకుంటూ, త్వరలోనే తన జీవిత చరిత్రను తాను రాయబోతున్నానని ఆ పుస్తకంలో తనకు వ్యక్తిగతంగా భగవంతుడితో కలిగిన అనుభవాలను అందరితోను పంచుకోవాలని భావిస్తున్నట్లు తెలియచేసాడు బ్రహ్మి. దీనిని బట్టి చూస్తుంటే భవిష్యతులో సినిమాలు తగ్గిపోయినా భగవంతుడితో తనకున్నా అనుభవాలను అందరికి వివరించేలా ఆధ్యాత్మిక విషయాలను వివరించే ఉపాధ్యాయునిగా బ్రహ్మానందం మారే లక్షణాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. మరి ఎం జరుగుతుందో చూద్దాం.

0 comments:

Post a Comment

 
Top