యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అప్ కమింగ్ మూవీ టెంపర్. టెంపర్ మూవీ ఫిబ్రవరి 13న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ ఘనంగా జరిగింది. అయితే ఈ ఆడియో ఫంక్షన్ లో జూనియర్ మాట్లాడిన తీరుపై అటు ఫ్యాన్స్ లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ పలు రకాలుగా టాక్స్ వినిపిస్తున్నయి. జూనియర్ ఎన్టీఆర్ అంటే కాన్ఫిడెంట్ కి నిర్వచనంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో పేరు ఉంది.
అలాంటిది టెంపర్ మూవీ ఆడియో ఫంక్షన్ లో మాత్రం, గతంలో ఆడియో ఫంక్షన్స్ లో మాట్లాడే టైగర్ లా కాకుండా, ఏదో చెప్పాలనుకొని, మరెదో చెప్పినట్టుగా ఉందని ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్స్ వినిపిస్తున్నాయి. ఓ మూవీ గురించి హిట్టా, ప్లాపా అనే మాట పక్కన పెడితే, మూవీ అవుట్ పుట్ బ్రహ్మండంగా వచ్చిందని చెబితే ఫ్యాన్స్ తోపాటు సినీ ప్రేక్షకుల్లోనూ ఆనందోత్సాలు వెల్లివిరిసేవి అని అంటున్నారు.
అలా కాకుండా ఈ మూవీ కాకపోయినా, మరో మూవీ, మరో మూవీ అంటూ సాగదీసిన టైమింగ్ అనేది చాలా మందిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా జూనియర్ మాత్రం, టెంపర్ ఆడియో ఫంక్షన్ లో కొత్తగా మాట్లాడి, టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యాడు. కాని సినీ ప్రేక్షకులు మాత్రం జూనియర్ ని పాత జూనియర్ లాగే చూడాలని కోరుకుంటున్నారంట.
జీవితంలో హిట్స్ వస్తాయి, రావు. కాని నాయకుడు మాట్లాడే తీరు ఎప్పుడూ ఒకేలా ఉండేలి అని ఫ్యాన్స్ లోనూ అంతర్గతంగా వినిపిస్తున్న సమాచారం. మొత్తంగా క్రేజీ క్రాంజినేషన్ తో రిలీజ్ అవుతున్న టెంపర్ మూవీ రిలీజ్ ఎలా ఉంటుందో తెలియాలంటే, రిలీజ్ వరకూ వెయిట్ చెయ్యాల్సిందే.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77472/Jr-ntr-temper-teper-film-temper-audio-jt-speech-te/
0 comments:
Post a Comment