Menu

నందమూరి తారకరామారావు మనవడిగా ఈరోజు టాలీవుడ్ ను షేక్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాలలో ఎదో ఒక విధంగా తన తాత నామ స్మరణ చేయకుండా ఉండలేడు. తన తాతకు మనవడిగా పుట్టడమే తాను చేసుకున్న అదృష్టం అని చెప్పే జూనియర్ తన తాత హావభావాలను తన నటనలో మిళితం చేస్తూ నందమూరి వంశ ఇమేజ్ ను తన స్థాయిలో కొనసాగిస్తున్నాడు.

ఇప్పుడు ప్రస్తుతం జూనియర్ నటిస్తున్న ‘టెంపర్’ సినిమాలో ఒకనాటి నందమూరి తారకరామారావు నటించిన ‘బొబ్బిలి పులి’ కోర్టు సీన్ మళ్ళీ ‘టెంపర్’ లో కనిపించబోతోంది అని టాక్. ఫిలింనగర్ లో వినపడుతున్న సమాచారం ప్రకారం ‘టెంపర్’ క్లైమేక్స్ సీన్ కు ముందు వచ్చే సీన్ లో పూరి జగన్నాథ్ రాసుకున్న సీన్ ను జూనియర్ మార్చి ‘బొబ్బిలి పులి’ కోర్టు సీన్ తరహాలో చిత్రీకరణ చేయించాడు అని టాక్.

జూనియర్ కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్ లను నిలదీసే ఈ సన్నివేసం పూరి మొదటి దీన్ని రాసుకోగా జూ.ఎన్టీఆర్ సూచన మేరకు దాన్ని కోర్టు సీన్ గా మార్చారని తెలుస్తోంది. దీనితో ఈ సీన్ బొబ్బిలి పులి లో ప్రీ క్లైమాక్స్ సీన్ ని గుర్తు చేస్తుందని అంటున్నారు. ఈ సీన్ లో ఎన్టీఆర్ చెప్పే డైలాగులకు థియోటర్ లో ఓ రేంజిలో హోరెత్తి పోతుందని భావిస్తున్నారు.

ఈ సన్నివేశం ఈ సినిమాకు కీ సీన్ గా మారుతుందని అంటున్నారు. రేపు విడుదల కాబోతున్న ఈ సినిమా ఆడియో పాటలు ఎలా ఉంటాయి అనే ఉత్సాహంతో అప్పుడే జూనియర్ అభిమానులు రేపటి రోజు కోసం ఎదురు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/77192/BOBBILI-PULI-INFLUENCE-ON-TEMPER/

0 comments:

Post a Comment

 
Top