Menu


మహేష్‌బాబుకి డబ్బు యావ ఎక్కువేమో... ప్రతి యాడ్‌లోను నటించేస్తున్నాడు అనుకుంటున్నారా? సినిమాల్లోనే రెండు చేతులా సంపాదిస్తున్న మహేష్‌కి పనిగట్టుకుని యాడ్స్‌ చేయాల్సిన పని లేదు. అయినా కానీ అన్ని సంస్థలతో ఎందుకని ఒప్పందం కుదుర్చుకుంటున్నాడు? యాడ్స్‌ మీద సంపాదించిన డబ్బులో ముప్పయ్‌ శాతం చారిటీకి కేటాయిస్తుంటాడట. 

తను ఎన్ని ఎక్కువ యాడ్స్‌ చేస్తే అంత సంపాదించవచ్చునని, అంతమందికి సాయపడవచ్చునని మహేష్‌ తన ఖాళీ సమయాన్ని పూర్తిగా యాడ్స్‌కే కేటాయిస్తున్నాడట. మహేష్‌ యాడ్‌ డీల్స్‌ అన్నీ మాట్లాడి క్లోజ్‌ చేసే నమ్రత చారిటీ పరంగా ఏ సంస్థలకి హెల్ప్‌ చేయాలనేది కూడా స్వయంగా చూసుకుంటుందట. ఇదంతా మహేష్‌బాబు ఎక్కడా చెప్పుకోలేదు. ఏ పేపర్లలోను రాలేదు. ఓ సందర్భంలో ఆలీతో మహేష్‌ దీని గురించి షేర్‌ చేసుకుంటే అది మరుగున ఉండిపోకూడదని ఆలీ దానిగురించి చెప్పాడు. మహేష్‌ ఇలాగే మరో వంద బ్రాండ్లతో ఒప్పందాలు చేసుకుని, మరింత మందికి సాయం అందించాలని ఆశిస్తూ అతనికి హేట్సాఫ్‌ చెప్దాం. 

source:http://telugu.gulte.com/tmovienews/8395/Mahesh-babu-remuneration-for-charity

0 comments:

Post a Comment

 
Top