Menu


'ఐ'తో పరాజయం చవిచూసిన శంకర్‌ తన తదుపరి చిత్రాన్ని రజనీకాంత్‌తో చేయాలని ఫిక్స్‌ అయ్యాడు. లింగతో డిజాస్టర్‌ టేస్ట్‌ చేసిన రజనీ కూడా శంకర్‌కే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు. ఈ ఆదివారమే ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ అవుతుంది. ఫిబ్రవరి 14న ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తారు. శివాజీ, రోబో తర్వాత ఈ కాంబినేషన్‌లో రానున్న హ్యాట్రిక్‌ మూవీ ఇది. ఐ ఫ్లాప్‌ అవడంతో శంకర్‌ తన నెక్స్‌ట్‌ మూవీ వెంటనే అనౌన్స్‌ చేయనున్నాడని అనుకుంటూనే ఉన్నారు. 

అయితే ఎవరితో శంకర్‌ సినిమా ఉంటుందనేది మాత్రం సస్పెన్స్‌గా ఉంది. మరోవైపు రజనీకాంత్‌కి పలువురు దర్శకులు కథలు వినిపిస్తున్నారు. అయితే శంకర్‌పై మాత్రమే రజనీకాంత్‌కి గురి కుదిరింది. ఇండియాలోని స్టార్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేసే ఈ చిత్రంలో హీరోయిన్‌ కూడా బాలీవుడ్‌లో బాగా పేరున్న నటీమణే ఉంటుందట. అన్ని వివరాల్ని ఆదివారం నాడు అనౌన్స్‌ చేస్తారు. అందాకా వేచి చూడక తప్పదు. 

source: http://telugu.gulte.com/tmovienews/8402/Rajinikanth-new-movie-with-Shankar

0 comments:

Post a Comment

 
Top