మెగా కుటుంబాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ పొగడ్తల వర్షం కురిపించడంలో బండ్ల గణేష్ కు మించిన సమర్ధుడు టాలీవుడ్ లో మరెవ్వరూ లేరు. సినిమాల ఆడియో ఫంక్షన్స్ జరిగాయి అంటే ఆ సినిమాకు సంబంధించిన హీరో, సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాతల ఏవీల గోల కంపల్సరీగా మారి చూసేవారికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా విధిగా చూడవలసిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఆ సినిమా హీరో దగ్గర నుంచి నిర్మాత వరకు అందరి గొప్ప తనాన్ని చాటుతూ వీడియో ఆడియో విజువల్స్ వేయడం నేటి ఆడియో ఫంక్షన్స్ ఆ చారంగా మారిపోయింది. అయితే మొన్న జరిగిన ‘టెంపర్’ ఆడియో ఫంక్షన్‌లోనూ ఇలాంటి ఏవీలు చూపించారు. అయితే బండ్ల గణేష్ కోసం చూపించిన ఏవీలో మాత్రం పవన్, చరణ్, బన్నీల జాడ లేకుండా జాగ్రత్త పడ్డారు.
మెగా కుటుంబంతో ‘తీన్‌మార్’, ‘గబ్బర్ సింగ్’, ‘ఇద్దరమ్మాయిలతో’, ‘గోవిందుడు అందరివాడేలే’ లాంటి సినిమాలను నిర్మించడమే కాకుండా బండ్ల గణేష్ ను నిర్మాతగా నిలబెట్టిన ‘గబ్బర్ సింగ్’ ప్రస్తావన గణేష్ గురించి సంబంధించిన ఏవీలో లేకపోవడం మెగా అభిమానులకే కాకుండా మెగా కుటుంబానికి షాక్ ఇచ్చిందని టాక్. ఇది ఇలా ఉండగా భారీ సినిమాలను తీసిన ఏ నిర్మాత అయినా ఎందుకైనా మంచిది అని ఖచ్చితంగా బయ్యర్లకు అమ్మేస్తూ ఉంటాడు.
అయితే దీనికి భిన్నంగా ఈ సినిమా రైట్స్ ఎవరికీ ఇవ్వకుండా సొంతంగా విడుదల చేద్దామని అనుకుంటున్నట్లు ఇదే విషయం తనకు పూరి కూడా చెప్పాడని బండ్ల గణేష్ ఆ ఆడియో ఫంక్షన్‌లో బహిరంగంగా ప్రకటించిన తీరు బయ్యర్లలో క్రేజ్ పెంచడానికి ఎంచుకున్న ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అనే ప్రచారం కూడా జరుగుతోంది.
0 comments:
Post a Comment