Menu

bayapeduthunna-rudrammadevi-anushka
ఏం చేసినా నేలమీద ఉండి చేయాలి. నేల విడిచి సాము చేస్తే ఎలా ఉంటుందో దర్శకుడు గుణశేఖర్‌కు ఇప్పుడు బాగా అర్థమవుతోంది. తన ట్రాక్‌ రికార్డు ఏంటి? లేడీ ఓరియెంటెడ్‌ మూవీకి ఇంత ఖర్చు పెడితే తిరిగొస్తుందా? అని ఆలోచించకుండా బడ్జెట్‌ విషయంలో హద్దులు దాటేశాడు. స్టార్‌ హీరోలకే వర్కవుట్‌ కాని రూ.50 కోట్ల బడ్జెట్‌లో రుద్రమదేవిని తీర్చిదిద్దాడు. తీరా ఇప్పుడు చూస్తే.. గుణశేఖర్‌ చెబుతున్న రేట్లు చూసి డిస్ట్రిబ్యూటర్లు 'రుద్రమదేవి'ని ముట్టుకోవడానికే వణికిపోతున్నారట. విడుదలకు అంతా సిద్ధం అని ప్రకటించి.. బిజినెస్‌ ఓపెన్‌ చేస్తే గుణ ఆశించిన రెస్పాన్స్‌ లేదట.

అన్ని ఏరియాల్లోనూ రికార్డు రేటు పెడితే తప్ప సినిమా హక్కులు దక్కే పరిస్థితి లేదు. సినిమాను అమ్మేసి ఫైనాన్స్‌ వ్యవహారాలన్నీ సెటిల్‌ చేసేయాలన్న ఉద్దేశంతో భారీ రేట్లు పెట్టాడు గుణ. కానీ కళ్లు మూసుకుని చెప్పిన రేటుకు కొనేయడానికి ఇదేమీ రాజమౌళి సినిమా కాదు. ఇందులో హీరో పవన్‌ కళ్యాణో మహేష్‌బాబో కాదు. గుణ చివరగా ఎప్పుడు హిట్టు కొట్టాడో కూడా ఎవరికీ గుర్తు లేదు. ఈ సినిమాలో అసలు హీరోనే లేడు. అల్లు అర్జున్‌ చేసింది గెస్ట్‌ రోల్‌. అరుంధతి హిట్టయింది కదా అని.. అనుష్కను చూసి కాసులు పోసేసే పరిస్థితి లేదు. సినిమాకు మంచి రెస్పాన్స్‌ వస్తే.. విడుదల తర్వాత థియేటర్లు పెంచుకోవడమో.. లేదంటే ఇన్ని వారాలు ఆడితే ఇంత అని అగ్రిమెంట్లు రాసుకోవడమో చేయాలి తప్పితే ఇప్పుడే పెట్టుబడి అంతా వచ్చేయాలి, టేబుల్‌ ప్రాఫిట్‌ వచ్చేయాలి అంటే కష్టమని గుణశేఖర్‌ గ్రహించాలి. లేకుంటే సినిమా విడుదల చేసుకోవడం కష్టం.


source:http://telugu.gulte.com/tmovienews/8420/Gunasekhar-opened-Rudramadevi-business

0 comments:

Post a Comment

 
Top