టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ పొజిషన్ లో హీరో మహేష్ బాబు. మహేష్ బాబు చాలా తక్కవ మూవీల్లో నటిస్తూ, అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోలలో ఒకరు. అలాగే, ఓ వైపు సినిమాలు, మరోవైపు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబు ఏడాదికి 51 కోట్లు సంపాదిస్తున్నారని ఫోర్బ్స్ ఇండియా పత్రిక వెల్లడించింది.
ఈ మొత్తం డబ్బుని మహేష్ ఏం చేస్తున్నాడు. ఎవరైన ప్రాపర్టీస్ ని పెంచుకుంటారు. ఆ తరువాత కూడ మిగిలిన మనీని మహేష్ ఏం చేస్తున్నారనేది? టాలీవుడ్ లో ప్రశ్నగా మారింది. భారీగా సంపాదిస్తున్న ఇంత మనీను ఎం చేస్తున్నారని..? మహేష్ బాబును అలీ ప్రశ్నించారట. అప్పుడు మహేష్ బాబు ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.
అనాధ పిల్లలకు, వృద్దులకు నమ్రత సహాయం చేస్తుంది. నా సంపాదనలో 30% తన చారిటికి ఇస్తున్నాను. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ చారిటికి ఇవ్వగలను కదా అని సమాధానం ఇచ్చారట. అయితే మహేష్ చేస్తున్న పని చాలా మంచిది. కాని లాజికల్ గా ఆలోచిస్తే, మహేష్ సంపాదనలో ప్రతి సంవత్సరం దాదాపు 8 నుండి 10 కోట్ల వరకూ ఇనకంటెక్స్ కట్టాల్సివస్తుందట.
దీంతో ఈ మనీ ఆలా ఖర్చు చేసేకంటే ఛారిటో పేరుతో పన్నులో రాయితీని పొందవచ్చు కదా? అని ఛారిటి రూటును మహేష్ ఎంచుకున్నాడంట. మహేష్ ఎలా ఆలోచించినా, 30 శాతం చారిటీకి వెళుతుందంటే, అది నిజంగా గ్రేటే అని అంటున్నారు.
source:http://www.apherald.com/Movies/ViewArticle/77471/Tollywood-mahehbabu-koratalashiva-koratalashiva-fi/
0 comments:
Post a Comment