March 18, 2025 08:36:09 AM Menu
Latest

6:28 PM test1



పవనకల్యాన్, వెంకటేష్ ల కాంబినేషన్ లో  రూపొందుతున్న భారీ ప్రతిష్టాత్మక చిత్రం 'గోపాల గోపాల' పై రోజు రోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇటీవల విడుదలైన ఆడియో కూడా అందరిని ఆకట్టుకుంటూ ఉండటంతో ఈ అంచనాలు రెట్టింపయ్యాయి.కాగా ఈ చిత్రాన్ని 9వ తేదీన విడుదల చేయనున్నట్లు నిన్నటివరకు ప్రచారం జరిగింది.కానీ సెన్సార్ కార్యక్రమాలతోపాటు మరి కొంత వర్క్ ఆలస్యం కావటంతో ఈ చిత్రాన్ని 10వ తేదీన విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.అందుకే ఈ చిత్రానికి సంబందించిన అఫీషియల్ ప్రకటన,ప్రచారం ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తుంది.ఇక ఈ చిత్రంలో  పోసాని కృష్ణమురళి పాత్ర హైలైట్ అవుతుందని అంటున్నారు. 'ఓ మైగాడ్' చిత్రంలో గోవింద నమోడే చేసిన పాత్రను ఇక్కడ పోసాని పోషిస్తున్నాడు. ఈ పాత్రకు నెగటివ్ టచ్ ఇచ్చి మరీ హైలైట్ చేసి కామెడీ చేయించినట్లు తెలుస్తోంది. దొంగ స్వామిగా పోసాని తనదైన స్పెషల్ డైలాగ్ డెలివరీతో ఆదరగొట్టాడని ఇన్ సైడ్ టాక్.త్వరలో ఈ పాత్రకు చెందిన డైలాగులతో ట్రైలర్ వదలనున్నారు.
08 Jan 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top