'బాహుబలి' చిత్రం కోసం ఆశగా ఎదురు చూస్తున్న సినీ ప్రియుల్లో ప్రత్యేకించి అనుష్క అభిమానులు ఎవరైనా ఉంటే మాత్రం ఇది వారికి ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. ఎందుకంటే 'బాహుబలి' ఫస్ట్ పార్ట్‌లో అనుష్క ఉండదట. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మెయిన్ హీరోయిన్ అనుష్క అని, సెకండ్ హీరోయిన్ తమన్నా అని అనుకున్నారు. కానీ అనుష్క పాత్ర రెండో భాగంలో మాత్రమే వస్తుందట.
మరి ముందుగా అనుష్కపై సీన్స్ ఎందుకు తీసారో అనుకోవచ్చు. రెండు భాగాలుగా కథని విభజించడంలో స్క్రీన్‌ప్లే పరంగా జరిగిన మార్పుల వల్ల అనుష్క పాత్ర రెండో భాగానికే పరిమితం అవుతుందట. యోధురాలిగా అనుష్కని చూడాలని, రాజమౌళి దృష్టికోణంలో ఆమెని వీరనారిగా చూడాలని ఆశపడుతున్న వారు బాహుబలి రెండో భాగం వచ్చే వరకు వేచి చూడక తప్పదు. అయితే అనుష్కని ఇందులో చూడలేకపోయిన లోటుని 'రుద్రమదేవి'లో తీర్చుకోవచ్చు. ఓ విధంగా రుద్రమదేవి చిత్రానికి బాహుబలి హెల్ప్ అవుతుందన్నమాట.
source:http://telugu.gulte.com/tmovienews/8400/Bad-news-for-Anushka-fans#sthash.c1UYiAC6.dpuf
0 comments:
Post a Comment