Menu

‘పటాస్’ సినిమా అంచనాలకు మించిన సక్సస్ ఇవ్వడంతో మంచి జోష్ మీద ఉన్నాడు కళ్యాణ్ రామ్. ఈ వీకెండ్ ముగిసిన తరువాత నిన్న మార్నింగ్ షోలకు కూడా ‘పటాస్’ ధియేటర్ల వద్ద జనం కన్పించడంతో కళ్యాణ్ రామ్ ఆనందానికి అంతులేదు. బి.సి. సెంటర్లలో ఈ సినిమా కలెక్షన్స్ దుమ్ము రేపుతోంది. ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో మీడియా వద్ద కళ్యాణ్ రామ్ చేసిన కామెంట్స్ అందర్నీ ఆశ్చర్య పరుస్తున్నాయి

గతంలో తన తాత నందమూరి తారకరామారావు టాలీవుడ్ ను ఏలుతున్న రోజులలో ఎన్టీఆర్ ముఖానికి మేకప్ వేసుకోకుండా ఖాళీగా 200 రోజులు గడిపారు అన్న విషయం చాలామందికి తెలియదని అదే విధంగా తాను ఒక సూపర్ హిట్ అందుకోవడానికి 10 సవత్సరాలు ఎదురు చూశానని తన తాత ఎన్టీఆర్ స్థాయితో కామెంట్ చేసుకున్నాడు కళ్యాణ్ రామ్. అంతేకాదు మెగా స్టార్ చిరంజీవి కూడా ఒకానొక సమయంలో వరస ఫ్లాపులతో సతమతమయ్యారు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు కళ్యాణ్ రామ్.

ఇదే సందర్భంలో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ త్వరలో తాను సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఒక బ్లాక్ బస్టర్ మూవీని ‘అతాస్’ డైరెక్టర్ తోనే తిరిగి రీమేక్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఈ నందమూరి హీరో. అయితే ఈ మాటలు విన్న మీడియా వారు మాత్రం కళ్యాణ్ రామ్ కు ‘పటాస్’ విజయం మరీ విపరీతమైన ఆత్మస్తైర్యాన్ని కలిగించిందని సీనియర్ ఎన్టీఆర్ సినిమాతో రీమేక్ చేయడం అంటే ఒక ప్రయోగమే అవుతుంది అని కామెంట్స్ చేసుకోవడం వినిపించింది.

దశాబ్ద కాలం తరువాత హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తన సినిమాల ఎంపికలో తప్పటడుగులు వేస్తే అది మళ్ళీ మరో 10 సంవత్సరాల గ్యాప్ కు అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77243/SENIOR-NTR200DAYS-KALYANRAM-10-YEARS/

0 comments:

Post a Comment

 
Top