Menu


అంజలి సినిమాలలో నటించడం మొదలు పెట్టేసరికి రోజా హీరోయిన్ పాత్రలు వదలి అమ్మ, అత్త, వదిన పాత్రలకు  పరిమితం అయింది. అటువంటి రోజా అంజలికి అనుకోకుండా పెద్ద షాక్ ఇచ్చింది. దర్శకుడు కలైంజియం కొంత కాలం అంజలికి కోలీవుడ్ లో గాడ్ ఫాదర్ వ్యవహరించి అంజలి కెరియర్ కు తొలినాళ్ళలో చాల సహాయం చేసాడు. ఆ తరువాత అంజలికి కలైంజియంకు భేదాభిప్రాయాలు రావడంతో అంజలి కోలీవుడ్ ను వదిలి భాగ్యనగరంలో సెటిల్ అవ్వడమే కాకుండా వీరిద్దరి వ్యవహారం కోర్టు కేసుల వరకు వెళ్ళింది. అయితే ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ కలైంజయం ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు. ట్విస్ట్ ఏమిటంటే తాను ప్రాణాలతో ఉండటానికి నటి రోజానే కారణమని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.  దీని గురించి దర్శకుడు కలైంజయం తెలుపుతూ ఆంధ్ర రాష్ట్రం రాజమండ్రిలో జరిగిన మిత్రుడి పెళ్లికి హాజరై మరుసటిరోజు ఉదయం చెన్నైకి తిరిగొస్తుండగా కారు చక్రం టైర్ బద్దలై కారులో ఉన్న వారందరూ హైవే రోడ్డుపై పడిపోయారని ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదని అంటూ ఆస్పత్రిలో బెడ్‌పై పడి వున్న తన వద్దకు లో ఒక వ్యక్తి నేరుగా తన బెడ్ వద్ద నిలబడి వున్న పోలీసు అధికారితో తాను రోజా మేడమ్ వద్ద నుంచి వస్తున్నాను. మేడమ్ ఫోన్‌లో లైన్‌లో ఉన్నారు మాట్లాడండి అని చెప్పారట.  దానితో కొన్ని నిమిషాల్లోనే కలైంజయంను పెద్ద ప్రైవేటు ఆస్పత్రికి మార్చినట్లు ఈ దర్శకుడు చెపుతున్నాడు. ప్రాణాపాయంలో ఉన్న తనను మృత్యువు నుండి కాపాడిన రోజాకు, ఆమె భర్త సెల్వమణికి కృతజ్ఞతలు చెపుతున్న దర్శకుడు కలైంజయo న్యూస్ ఒక విధంగా అంజలికి షాకింగ్ న్యూస్ అనుకోవాలి.

0 comments:

Post a Comment

 
Top