Menu


నిన్న ఇరు రాష్ట్రాలలోను పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగినా పవన్ పుట్టినరోజు సందర్భంగా ‘ముకుంద’ టీజర్ విడుదల అయినా, పవన్ కొడుకు అకిరా నందన్ సినిమా ఎంట్రీ పై క్లారిటీ వచ్చినా పవన్ అభిమానులకు మాత్రం జరిగిన ఈ విషయాలు  ఏ మాత్రం జోష్ ఇవ్వలేదు.

  దీనికి కారణం పవన్ నటిస్తున్న ‘గోపాల గోపాల’ ఫస్ట్ లుక్ నిన్న విడుదల అవుతుందని పవన్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురు చూసారు. మీడియా వార్తలలో కూడ గోపాలుడి ఫస్ట్ లుక్ పవన్ పుట్టినరోజునాడు బయటకు వస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అందరి అంచనాలను తల క్రిందులు చేస్తూ గోపాలుడి ఫస్ట్ లుక్ పవన్ పుట్టినరోజునాడు బయటకు రాలేదు. దీనిపై ఫిలింనగర్ లో ఒక ఆశక్తికర గాసిప్ హడావిడి చేస్తోంది. మొదట్లో పవన్ పుట్టిన రోజున ఫస్ట్ లుక్ విడుదల చేద్దామని అనుకున్నా తర్వాత విరమించుకోవటానికి గల కారణం ఈ సినిమా నిర్మాతల ఆలోచన అంటున్నారు. 

‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ గెటప్ ఎలా ఉంటుందో అనే సస్పెన్స్ సినిమా విడుదల అయ్యేవరకు ఆపితే ఈ సినిమా క్రేజ్ మరింత పెరుగుతుంది అని ఈ సినిమా నిర్మాతల ఆలోచనట.  ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాలోని పవన్ గోపాలుడి గెటప్ కు ఏమైనా నెగిటివ్ కామెంట్లు పడితే అది ఈ సినిమా క్రేజ్ పైన ఆఫై ఈ సినిమా మార్కెట్ పైన ప్రభావం చూపెడుతుంది కాబట్టి నిర్మాతలు ఈ నిర్ణయం తీసుకున్నారు అని టాక్. అయితే ఈ సినిమా ఆడియో విడుదల సందర్భంగా విడుదల అయ్యే టీజర్ లో అయినా పవన్ ‘గోపాలుడి’ లుక్ కనిపించితీరాలి. మరి దీనికి ఈ సినిమా నిర్మాతలు ఏ పరిష్కారం ఆలోచిస్తారో చూడాలి.

0 comments:

Post a Comment

 
Top