Menu


పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘ఆగడు' సినిమాది ఈ ఏడాది క్రేజీ ప్రాజెక్టుల్లో అగ్ర స్థానం. ‘దూకుడు' వంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత మహేష్ బాబు, శ్రీను వైట్ల కాంబినేషన్‌ సినిమా కావడమే దీనికి కారణం. ఈ చిత్రంలో నాగార్జున పాపులర్ గేమ్ షో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' స్పూఫ్ ఉండనుందని తెలుస్తోంది. అయితే ప్యారెడీగా సీన్స్ ఉండవని, మహేష్ బాబు హాట్ సీట్ లో కూర్చుని మరికొందరని ప్రశ్నలు అడుగుతారని తెలుస్తోంది. ఇది సెటైర్ సీన్ కాదని, సినిమాలో ఓ ఇంపార్టెంట్ సీన్ లో ఒకటని తెలుస్తోంది.
ఇక మహేశ్‌ జోడీగా తొలిసారి తమన్నా నటిస్తుండటం, శ్రుతిహాసన్‌ ఓ పాటలో మహేశ్‌తో స్టెప్పులేయడం అదనపు ఆకర్షణలు. ‘1.. నేనొక్కడినే' సినిమాతో నటునిగా అందరి ప్రశంసలు పొందినా, వాణిజ్యపరంగా చేదు అనుభవాన్ని చూసిన మహేశ్‌ ఈ సినిమాతో తన బాక్సాఫీస్‌ స్టామినాని నిరూపించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు.
మహేష్‌బాబు మాట్లాడుతూ... ''నా సినీ ప్రయాణాన్ని మలుపు తిప్పిన చిత్రం 'దూకుడు'. ఆ సెట్‌లో ఉన్నప్పుడే 'ఆగడు' పేరుతో మరొక సినిమా చేయాలనుకొన్నాం. ఇందులో నేను కనిపించే విధానం, సంభాషణలు చెప్పే తీరు కొత్తగా ఉంటాయి. నటుడిగా నాకు మరో కీలకమైన మలుపు అవుతుంది'' అన్నారు
''మహేష్‌ని 'దూకుడు'లో పదిశాతం మాత్రమే చూశారు. ఇందులో వందశాతం చూస్తారు. అభిమానులు కూడా ఆశ్చర్యపోయేలా ఆయన తెరపై కనిపించబోతున్నాడు'' అన్నారు శ్రీనువైట్ల. మహేశ్‌ చెప్పిన ‘డిక్కీ బలిసిన కోడి చికెన్‌ షాప్‌ ముందుకొచ్చి తొడకొట్టిందంట', ‘అయినా నువ్వు డైలాగ్‌ వేస్తే కౌంటర్‌ వెయ్యడానికి నేను రైటర్‌ని కాదు ఫైటర్‌ని, అయ్యబాబోయ్‌ నాకు సినిమా డైలాగులు వొచ్చేస్తన్నాయేంటి' డైలాగులకు అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ కొత్త టీజర్‌తో ‘ఆగడు' సినిమా ఎలా ఉండబోతోందో డైరెక్టర్‌ శ్రీను వైట్ల ఒక ‘ఫీలర్‌' వదిలారని వారంటున్నారు. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టుగా మహేశ్‌ నటిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్‌ 19 న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
'ఆగడు' సినిమా కోసం శ్రుతి హాసన్ ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడుతోంది. ''తమన్‌ అందించిన మాస్‌ మసాలా గీతమిది. ఇందులో మహేష్‌, శ్రుతిహాసన్‌ స్టెప్పులు ప్రేక్షకులకు కిక్‌ ఇస్తాయి'' అంటోంది చిత్రబృందం.
డా.రాజేంద్రప్రసాద్, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, నెపోలియన్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రచన: అనీల్ రావిపూడి, ఉపేంద్ర మాధవ్, రచనా సహకారం: ప్రవీణ్ వర్మ, సంగీతం: ఎస్.ఎస్.థమన్, సినిమాటోగ్రఫీ: కె.వి.గుహన్, ఆర్ట్: ఎఎస్ ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, కో-డైరెక్టర్: చలసాని రామారావు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కోటి పరుచూరి, నిర్మాతలు: రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర, కథ-స్ర్కీన్ ప్లే-మాటలు-దర్శకత్వం: శ్రీను వైట్ల.

0 comments:

Post a Comment

 
Top