Menu



కుంచెతో అద్బుతాలు సృష్టించడమే కాదు, వెండి తెరపై ఎన్నో మధురమైన సినిమాలను రూపొందించిన బాపు మనల్ని విడిచి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోవడం శోచనీయం.

1933 డిసెంబర్ 15న పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో జన్మించిన బాపు ఆగస్ట్ 31, 2014న చెన్నైలో కన్నుమూశారు. గుండెపోటుతో భాదపడుతున్న బాపు

చెన్నైలో ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. బాపు అసలు పేరు సత్తిరాజు లక్ష్మీ నారాయణ. అయన వయసు 80 సంవత్సరాలు.
‘సాక్షి’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన బాపు 2011లో విడుదలైన ‘శ్రీ రామరాజ్యం’ వరకు 51 సినిమాలకు దర్శకత్వం వహించారు. రామాయణం యొక్క ప్రభావం

బాపు సినిమాలలో ఎక్కువగా కనిపిస్తుంది. ‘ముత్యాల ముగ్గు’, ‘పెళ్లి పుస్తకం’, ‘అందాల రాముడు’, ‘మిస్టర్ పెళ్ళాం’, ‘శ్రీ రామ రాజ్యం’ బాపు దర్శకత్వం

వహించిన సినిమాలలో ఆణిముత్యాలు. దర్శకుడిగానే కాదు, కార్టూనిస్ట్ గా అంతర్జాతీయ గుర్తింపు సొంతం చేసుకున్నారు. బాపు బొమ్మలు, బాపు లిపి ఎంత ప్రసిద్దో

ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్ కార్టూనిస్ట్ లు, చిత్ర పరిశ్రమలో ప్రవేసించే యువ దర్శకులు ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు.
చిత్ర పరిశ్రమకు బాపు చేసిన కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2013లో పద్మ శ్రీ తో సత్కరించారు. రెండు జాతీయ అవార్డులతో పాటు 5 నంది అవార్డులను, రెండు ఫిల్మ్

ఫేర్ అవార్డులను అందుకున్నారు.
తెలుగులోనే కాకుండా తమిళ, హిందీ సినిమాలకు కూడా బాపు దర్శకత్వం వహించారు. బాపు మృతి తెలుగు సినిమా రంగానికి తీరని లోటు. ప్రముఖులు ఆయన మృతి

పట్ల ప్రగాడ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. 123తెలుగు.కామ్ తరపున బాపు మృతికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నాం.

0 comments:

Post a Comment

 
Top