ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘ఆగడు’ సినిమా ఆడియో ఆగస్ట్ 30న అభిమానుల కోలాహలం మధ్య విడుదలైంది. యువ సంగీత సంచలనం ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పాటలను భాస్కరభట్ల, శ్రీమణి రచించారు. సంగీత దర్శకుడిగా తమన్ 50వ సినిమా ‘ఆగడు’. ‘దూకుడు’, ‘బిజినెస్ మాన్’ వంటి హిట్ ఆల్బమ్స్ తర్వాత మహేష్ – తమన్ కాంబినేషన్లో వస్తున్న ‘ఆగడు’ ఆడియో ఎలా ఉందొ ఒకసారి చూద్దాం..
1) పాట : ఆగడు
గాయకులు : శంకర్ మహదేవన్review-6
ఆల్బంలో ఇది మొదటి పాట. ‘ఆగడు’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ను శంకర్ మహదేవన్ పాడారు. వినగానే ఈ పాట అందరిని ఆకట్టుకుంటుంది. హమ్ చేసేలా ఉంది. ట్యూన్ చాలా ఎనర్జిటిక్ గా ఉంది. పాటలో హీరో పవర్ తెలియజేసేలా లిరిక్స్ అద్బుతంగా ఉన్నాయి. బ్యాక్ గ్రౌండ్లో వచ్చే నేపధ్య గానం అట్రాక్టివ్ గా, వినసొంపుగా ఉంది. స్టన్నింగ్ విజువల్స్ సినిమాలో ఈ పాటను అద్బుతంగా తెర్చిదిద్దాయని సమాచారం.
2) పాట : ఆజ సరోజ
గాయకులు : రాహుల్ నంబియార్
review-1
రాహుల్ నంబియార్ పాడిన ఈ రొమాంటిక్ పాటను విశ్లేషించడానికి చాలా కష్టం. తమన్ చాలా సున్నితమైన, శ్రావ్యమైన ట్యూన్ అందించారు. భాస్కరభట్ల సాహిత్యం చాలా కవితాత్మకంగా ఉంది. హీరో హీరోయిన్ల మధ్య ప్రేమను ఈ పాటలో వర్ణించారు. సాంగ్ చాలా క్యాచీగా ఉంది. వినగానే ఆకట్టుకుంటుంది.


3) పాట : భెల్ పూరి
గాయకులు : రాహుల్ నంబియార్, ఎంఎం మానసిreview-2
‘ఆగడు’ ఆడియోలో ‘భెల్ పూరి’ సాంగ్, ది బెస్ట్ సాంగ్ అని చెప్పొచ్చు. చాలా రోజుల తర్వాత తమన్ స్వరపరిచిన అద్బుతమైన ట్యూన్ ఇది. రాహుల్ నంబియార్, ఎంఎం మానసిల వాయిస్, భాస్కరభట్ల లిరిక్స్ పాటకు సరికొత్త ఫీల్ తీసుకొచ్చాయి. మాస్ అప్పీల్ తో సాగే పాటలో మహేష్ స్టైలిష్ స్టెప్స్, తమన్నా అందాలు అభిమానులకు కనువిందు చేస్తాయని సమాచారం. ఆడియోలో ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ సాంగ్ ఇది.
4) పాట : భెల్ పూరి
గాయకులు : సూరజ్ సంతోష్
review-5
టిపికల్ తమన్ స్టైల్ లో సాగిపోయే ఫాస్ట్ బీట్ మాస్ మసాలా సాంగ్ ఇది. తమన్ ట్రేడ్ మార్క్ డ్రమ్స్, ఇతర వాయిద్యాల సౌండ్స్ వినొచ్చు. కేవలం మాస్ ప్రేక్షకులను, అభిమానులను దృష్టిలో పెట్టుకుని కంపోజ్ చేసిన ఈ సాంగ్ ఇది. క్యాచి ట్యూన్ కాస్త ఆకట్టుకునేలా, వినసొంపుగా ఉంది. ఎలా చిత్రీకరించారు అనే దానిపై ఈ సాంగ్ భవితవ్యం ఆధారపడి ఉంది.


5) పాట : నారి నారి
గాయకులు : తమన్, దివ్య
review-7
సరదా సరదాగా సాగిపోయే ఈ పాటను సంగీత దర్శకుడు తమన్ స్వయంగా పాడడం విశేషం. ఈ పాట చాలా ఇంటరెస్టింగ్ గా సాగుతుంది. సరదాగా ఉన్నా వినగానే ఆకట్టుకునే పాట ఇది. తమన్ కంపోజ్ చేసిన పెప్పి మ్యూజిక్ చాలా బాగుంది. తమన్ వాయిస్ పాటకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. నారి నారి అంటూ కోరస్ వాయిస్ చాలా క్యాచిగా, హమ్ చేసేలా ఉంది. అటు క్లాస్ ఇటు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే సాంగ్ ఇది.
6) పాట : ఆగడు థీమ్ మ్యూజిక్
గాయకులు : మహేష్ బాబు, శ్రీను వైట్ల, తమన్
review-9
‘ఆగడు’ ఆడియోలో చివరి పాటగా థీమ్ మ్యూజిక్ ను ప్రేక్షకులకు అందించారు. మూవీలో మహేష్ బాబు చెప్పిన డైలాగులను ఇంటరెస్టింగ్ మ్యూజిక్ తో తమన్ రీమిక్స్ చేసిన తీరు బాగుంది. థీమ్ మ్యూజిక్ లో విశ్లేషించడానికి ఏమి లేదు.


తీర్పు:
తమన్ స్వరపరిచిన రాకింగ్ ఆల్బమ్స్ ‘ఆగడు’. సంగీత దర్శకుడిగా తన 50వ సినిమాకు పూర్తి న్యాయం చేకూర్చాడు. నారి నారి, భెల్ పూరి సాంగ్స్ ఆడియోలో హిట్ సాంగ్స్. ఈ రెండు పాటలు అటు అభిమానులను, ప్రేక్షకులను ఫస్ట్ టైం వినగానే ఆకట్టుకుంటాయి. కంప్లీట్ ‘ఆగడు’ ఆల్బం చాలా క్యాచిగా ఉంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే పాటలను తమన్ అందించారు. ‘ఆగడు’ ఆడియో సినిమా క్రేజ్ పెంచడంలో, విజయంలో ముఖ్య భూమిక పోషిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. మహేష్ బాబు, తమన్ కాంబినేషన్లో మరొక సూపర్ హిట్ & ఎంటర్ టైనింగ్ ఆల్బం ‘ఆగడు’.






Source:http://www.123telugu.com/telugu/reviews/aagadu-audio-review.html