Menu



ఎన్టీఆర్ కు కెరీర్ ప్రారంభంలోనే ఆది, సింహాద్రి, యమదొంగ వంటి సూపర్ హిట్స్ పడటం, ఆ తర్వాత బృందావనం,బాద్షా వంటి కుటుంబాలను సైతం ఆకట్టుకునే చిత్రాలు రావటంతో అటు మాస్, ఇటు క్లాస్ రెండు వర్గాల్లోనూ క్రేజ్ ఏర్పడింది. దాంతో ఈ మధ్య కాలంలో తరుచూ పరాజయాలు పలకరిస్తూ ఉన్నా ఓపినింగ్స్ ,బిజినెస్ ఏ మాత్రం ఎక్కడా తగ్గటం లేదు. దానికి తోడు ‘రభస' చిత్రాన్ని పూర్తి యాక్షన్ గా కాకుండా ఎమోషన్స్ తో కూడిన కామెడీ చిత్రంగా కూడా ప్రమోట్ చేయటం సినిమాకు కలిసివచ్చింది. అలాగే ఎన్టీఆర్ పాడిన పాట ఇప్పటికే జనాల్లోకి బాగా వెళ్లటం, ఆయన ట్రేడ్ మార్క్ డాన్స్ లు అభిమానులకు ఈ చిత్రంపై విపరీతమైన అంచనాలు పెంచుకునేలా చేసాయి. అయితే ఆ అంచనాలును అందుకోవటానికి దర్శకుడు ఎక్కడా ప్రయత్నించలేదనిపిస్తుంది. 

ఎన్టీఆర్ కి ఇమేజ్ కి కొద్దిగా కూడా అతకని కథతో నానా ‘రభస' చేయటానికి ప్రయత్నించాడు. సెకండాఫ్ లో వచ్చే బ్రహ్మానందం ఎపిసోడ్, ఎన్టీఆర్ నటన లేకపోతే చాలా ఇబ్బందిగా ఉండేది. అప్పటికీ ఎన్టీఆర్ వన్ మ్యాన్ షో లాగ మొదటి నుంచి చివరి దాకా తన భుజాలపైనే సినిమాను మోయటానికి ప్రయత్నించాడు. కార్తీక్‌ (ఎన్టీఆర్‌) ...తన తల్లి(జయసుధ) కి మరదలు(మామయ్య షాయీజీ షిండే కూతురు)నే పెళ్లి చేసుకుంటానని మాట ఇస్తాడు. అయితే అంత ఈజీ కాదు. తన చిన్నప్పుడే ఆ మామయ్య తన తండ్రి(నాజర్)తో విభేదించి సిటీకి వెళ్లి ఎదుగుతాడు. దాంతో ఇప్పుడు తన మరదలుని వెతుక్కుంటూ సిటీకి వస్తాడు. అక్కడకి వచ్చాక బాగ్యం(ప్రణీత)ని చూసి పొరబడి ఆమే తన మరదలు అనుకుని ఆమె వెంటబడతాడు. కొంత దూరం ఆ ప్రేమ ప్రయాణం జరిగాక... తన మరదలు ఆమెకాదు... తను ఎప్పుడూ గొడవపడే ఇందు (సమంత)అని రివిల్ అవుతుంది. సర్లే ఇందునే లైన్ లో పెడదామనుకుంటే ఇందు ఆల్రెడీ వేరే వ్యక్తితో ప్రేమలో ఉంటుంది. అలాంటి పరిస్ధుతుల్లో కార్తీక్ తన తల్లికి ఇచ్చిన మాట ఎలా నిలబెట్టుకున్నాడు...ఇందుని ఎలా ఒప్పించాడు అనేది రక రకాల ట్విస్ట్ లతో కూడిన కథ.

 తెలుగు సినిమా ఇంకా 'రెడీ' (చిత్రం) నుంచి ఇంకా బయిటకు రాలేదని ఈ సినిమా మరోసారి ప్రూవ్ చేస్తుంది. శ్రీను వైట్లను గుర్తు చేసేలా సీన్స్, డైలాగ్స్ రాసుకున్నా సినిమాలో కాంప్లిక్ట్ సరిగ్గా వర్కవుట్ చేయకపోవటం, నెగిటివ్ ఫోర్స్ స్పష్టంగా,బలంగా లేకపోవటంతో తేలిపోయినట్లైంది. అలాగే హీరో తన మరదలు ను వివాహం చేసుకునే దిసగా కథ మొదలెట్టి ఎటెటో వెళ్లిపోతుంది. పోనీ సెకండాఫ్ లో వచ్చి బ్రహ్మానందం ఎప్పటిలాగే రక్షిస్తాడు అనుకుంటే ఆ పాత్ర కొద్దిగా నవ్వించగలిగింది కానీ కథని (రెడీ లాగ) ముందుకు తీసుకువెళ్లేలా క్యారక్టర్ డిజైన్ చెయ్యలేదు. అలాగే అలీ పాత్ర ఎప్పటిదో పాత నాగార్జున అల్లరి అల్లుడులో బ్రహ్మానందం పాత్రను గుర్తుచేసింది..కానీ దానికీ ముగింపు ఇవ్వలేదు. ఇక ప్రణీత పాత్ర సైతం ముగింపు లేకపోవటంలో సమగ్రత లేకుండాపోయింది.
ప్లస్ లు 

ఎన్టీఆర్ లాంటి పెద్ద హీరో సినిమాలో బ్రహ్మానందం పాత్ర బాగా పేలింది అని చెప్పటం కాస్త ఇబ్బందికరమే అయినా ఉన్నంతలో బ్రహ్మీనే థియోటర్ లో కాస్త నవ్వులు పూయించాడు. ఎందుకంటే మొదటి నుంచి ఈ సినిమా యాక్షన్ కామెడీ అని ప్రమోట్ చేసారు. అదే ఎక్సపెక్టేషన్స్ తో థియోటర్ కి వచ్చినవారికి కాస్త రిలీఫ్. అలాగే ఎన్టీఆర్ కాకుండా మరో హీరో చేసి ఉంటే ఈ మాత్రం కూడా చివరివరకూ చూడటం కష్టమయ్యేది.


వీక్ పాయింట్స్ర

న్ టైం...162 నిముషాలు ఉండటం ఈ సినిమాకు బాగా లెంగ్తీ సినిమా చూసిన ఫీలింగ్ తీసుకు వచ్చింది. మొదటే చెప్పుకున్నట్లు రొటీన్ కథ,కథనం సినిమాను ప్రెష్ నెస్ లేకుండా చేసేసింది. అలాగే ప్రెడిక్టబుల్ ట్విస్ట్ లు సైతం పేలలేదు.. ఇక ఫస్టాఫ్ లో అయితే ఇంటర్వెల్ వచ్చేసినా కథలోకి రారు. సెకండాఫ్ అయితే రెడీ, దూకుడు,బాద్షా,మిర్చి లోంచి కొంచెం కొంచెం తీసుకుని కథ అల్లినట్లు తెలిసిపోతూ ఉంటుంది.


0 comments:

Post a Comment

 
Top