ఏవేవో పబ్లిసిటీ స్టంట్స్ చేస్తూ బాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన హాట్ భామ పూనమ్ పాండే తనను ఇప్పుడెవరూ పట్టించుకోవడంలేదని బాధపడుతోంది. 'ఎఐబి' ప్రోగ్రామ్‌కి మద్దతు పలుకుతూ పూనమ్ పాండే స్టేట్‌మెంట్ ఇస్తే దాన్ని కేవలం ఓ న్యూస్‌గానే భావించారు బాలీవుడ్‌లో. 'మాలిని అండ్ కో' మూవీలో నటిస్తున్న సంగతిని పూనమ్ చెప్పుకుంటున్నా, బాలీవుడ్‌లో అంతా లైట్ తీసుకున్నారు. తెలుగు మూవీ కావడంతో 'మాలిని అండ్ కో' గురించి బాలీవుడ్‌లో ఎక్కువగా చెప్పుకోడానికేమీ వీలు పడటంలేదట పూనమ్ పాండేకి. అది కాదు అసలు సంగతి. సన్నీలియోన్ రాకతో పూనమ్ పాండేకి డిమాండ్ పడిపోయింది. దానికి తోడుగా ఇంకో రీజన్ కూడా ఉంది.
మీడియాపై ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా ఏవేవో సెటైర్లు వేసినందువల్ల, పూనమ పాండేని బాలీవుడ్ మీడియా కూడా లైట్ తీసుకుందంటున్నారు. మల్లికా షెరావత్‌తో పోల్చితే పూనమ్ పాండే సాధించిందేమీ లేకపోయినా, పబ్లిసిటీ నాలుగాకులు పూనమ్‌కే దక్కింది. ఇప్పుడు ఆ పబ్లిసిటీ కూడా పూనమ్‌కి దొరకడంలేదు. క్రికెట్ వరల్డ్ కప్ వస్తోంది కాబట్టి 'న్యూడిటీ' స్టంట్ పూనమ్ చేస్తుందేమో అని ఆమె ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు. అదొక్కటీ చేసినా పూనమ్‌ని ఎవరైనా పట్టించుకుంటారో లేదో.
source: http://telugu.gulte.com/tmovienews/8553/No-craze-for-Poonam-pandey#sthash.4NBYxJk0.dpuf

0 comments:
Post a Comment