Menu


టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సంక్రాంతి బరిలో దిగిన అతి పెద్ద చిత్రం గోపాల గోపాల. గోపాల గోపాల మూవీకి సంబంధించి బాక్సాపీస్ రిపోర్ట్ పై ప్రతి ఒక్కరు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇదిలా టాలీవుడ్ బాక్సాపీస్ వద్ద గోపాల గోపాల మూవీకి విపరీతమైన కలెక్షన్స్ వచ్చాయి. మొదటి రోజు బాక్సాపీస్ దమ్ములేపే కలెక్షన్స్ తో అధరగొట్టింది. డొమెస్టిక్ మార్కెట్ గోపాల గోపాల మూవీ 13 కోట్ల రూపాయలకు పైగా, కొల్లగొట్టిందని బాక్సాపీస్ రిపోర్ట్స్ చెబుతుంది. ఓవర్సీస్ తో కలుపుకొని ఈ కలెక్షన్స్ 15 కోట్ల రూపాయలను టచ్ చేసిందంటూ ఇండస్ట్రీ లెక్కలు చెబుతున్నాయి.

అయితే డొమెస్టిక్ మార్కెట్ లో గోపాల గోపాల మూవీకి ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు, మరి కాసేపట్లో ప్రత్యేకంగా మీకు అందజేస్తాము. మొదటి రోజు బాక్సాపీస్ వంద శాతం ఆక్యుపెన్సీతో ప్రదర్శించబడటంతో, ఈ మూవీకి ఊహించినదాని కంటే ఎక్కువ కలెక్షన్స్ బాక్సాపీస్ వద్ద నమోదు అయ్యాయి. సంక్రాంతికి మరే పెద్ద చిత్రం తెలుగు నుండి పోటీ లేకపోవడంతో, ఈ మూవీపై అత్యధిక కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.  శంకర్ మూవీ ఐ, గోపాల గోపాల మూవీపై ఏ మాత్రం ప్రభావితం చూపించదని బాక్సాపీస్ రిపోర్ట. గోపాల గోపాల మూవీకి రిపీటెడ్ ఆడియోన్స్ కూడ వెళ్ళడంతో, కలెక్షన్స్ మరింత ఎక్కువయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. మొత్తంగా సంక్రాంతి పండుగు సందర్భంగా రిలీజ్ అయిన గోపాల గోపాల మూవీ, టాలీవుడ్ బాక్సాపీస్ ని దమ్ములేపడం కాయం అని ట్రేడ్ టాక్. 

source:http://www.apherald.com/Movies/ViewArticle/75976/Goapala-gopala-gopala-pawan-kalyan-tollywood-venka/

0 comments:

Post a Comment

 
Top