ఏదైనా సమస్య ఎదురైనప్పుడు తక్షణమే మన మదిలోకి వచ్చేది పోలీస్ స్టేషనే. కానీ.. అలాంటి పోలీస్ స్టేషన్లలో కొన్ని సందర్భాల్లో జరగకూడని సంఘటనలు చాలానే జరుగుతుంటాయి. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు వీలుగా బాంబే హైకోర్టు కేక పుట్టించే ఒక తీర్పు ఇచ్చిందని చెప్పాలి.
న్యాయం జరగాల్సిన చోట అన్యాయం జరగటం.. కొన్నిసార్లు అధికారానికి.. మరికొన్నిసార్లు డబ్బు కోసం చట్టానికి విరుద్ధంగా వ్యవహరించటం.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం తెలిసిందే.
అలాంటివి చోటు చేసుకోకుండా ఉండేందుకు వీలుగా.. పోలీస్ స్టేషన్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిందిగా తాజాగా బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. మహరాష్ట్రలోని ఒక పోలీస్‌స్టేషన్లో జరిగిన లాకప్ డెత్ కేసుకు సంబంధించిన కేసు విచారణ సందర్భంలో రాష్ట్రం మొత్తంగా ఉన్న పోలీస్ స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ సందర్భంగా స్పందించిన ప్రభుత్వ న్యాయవాది.. ఇప్పటికే కొన్ని పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశామని.. ఇప్పటికిప్పుడే సీసీ కెమేరాల ఏర్పాటు సాధ్యం కానప్పటికీ.. కొంత సమయం పడుతుందని చెప్పారు. అత్యవసరం అనుకుంటే.. సీసీ కెమేరాల ఏర్పాటు అసాధ్యమైన విషయమేమీ కాదు కదా. మరి.. కోర్టు తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర సర్కారు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
source: http://telugu.gulte.com/tnews/8043/Bombay-High-Court-orders-to-install-CC-cameras-in-Police-station#sthash.HlRRQcDM.dpuf

0 comments:
Post a Comment