Menu



తీసినవి తక్కువ సినిమాలే అయినా కానీ తనదైన ముద్ర వేసి, తనకంటూ ఒక బ్రాండ్‌ సంపాదించుకున్నాడు దర్శకుడు శేఖర్‌ కమ్ముల. అతని సినిమాలకి గ్యారెంటీ ఆడియన్స్‌ ఉన్నారు. మోస్ట్‌ ఒరిజినల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న శేఖర్‌ కమ్ముల 'అనామిక'తో రీమేక్‌ చేసి ఫెయిలయ్యాడు. 'లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌', 'అనామిక' తన స్థాయికి చిత్రాలు కాదనిపించడంతో శేఖర్‌ కమ్ముల కొంతకాలంగా కనిపించడం లేదు. తన మార్కు సినిమా తీయడానికి శేఖర్‌ కమ్ముల ఒక కథ సిద్ధం చేస్తున్నాడు. అందుకే అతను బయట తిరగకుండా పూర్తి సమయం కథకే కేటాయిస్తున్నాడట. 

ఈ స్టోరీ లైన్‌ని అల్లు అర్జున్‌కి వినిపించాడని, అతను వినగానే అద్భుతంగా ఉందని చెప్పాడని, కమ్ముల డైరెక్షన్‌లో నటించడానికి సిద్ధమంటున్నాడని వార్తలు వస్తున్నాయి. శేఖర్‌ కమ్ములకి ఇంతవరకు స్టార్‌ హీరోలతో చేసిన అనుభవం లేదు. స్టార్‌ హీరోలకి దూరంగా తనదైన శైలిలో సినిమాలు తీసే శేఖర్‌ స్టార్స్‌ని అప్రోచ్‌ అయ్యాడు కానీ వారికి కాన్ఫిడెన్స్‌ కలిగించలేకపోయాడు. మరి అల్లు అర్జున్‌తో అయినా అతని సినిమా మెటీరియలైజ్‌ అయితే మిగిలిన స్టార్స్‌కి కూడా నమ్మకం కలిగించే సినిమా తీయగలడో లేదో? 


source:http://telugu.gulte.com/tmovienews/8040/Allu-Arjun-in-Sekhar-Kammula-Direction

0 comments:

Post a Comment

 
Top