Menu

tamil-mahaabalifilm-bahubali-prabhas-rajamouli
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే క్రేజీ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న చిత్రం బాహుబలి. బాహుబలి మూవీకి సంబంధించిన ప్రతి న్యూస్, ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో అంచనాలను పెంచుతుంది. ఇదిలా ఉంటే ఫిల్మ్ ఇండస్ట్రీ మార్కెట్ లోనూ బాహుబలి మూవీపై ప్రత్యేక క్రేజ్ క్రియేట్ అవుతుంది. ప్రభాస్, రానా, అనుష్క లీడ్ రోల్స్ లో చేస్తున్న బాహుబలి మూవీపై తమిళ మార్కెట్ కన్ను పడింది.

వివరాల్లోకి వెళితే, బాహుబలి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలతో పాటు ఇతర దేశాలలోను భారీ ఎత్తున విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఒక్క తమిళంలో మాత్రమే బాహుబలి 25 కోట్లు రూపాయలకి అమ్ముడు పోయిందని క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. తమిళంలో భారీ చిత్రాలను నిర్మించిన స్టూడియో గ్రీన్‌సంస్థ అధినేత కెఇ జ్ఞానవేల్ రాజ్ బాహుబలి హక్కులను సొంతం చేసుకోవడం విశేషం.

ఈ విషయాన్ని జ్ఞానవేల్ రాజా స్పష్టం చేస్తూ బాహుబలి చిత్ర తమిళ హక్కులను తాను యువి క్రియేషన్స్‌తో కలిసి చేజిక్కించుకున్నట్టు తెలిపారు. ఈ చిత్రంలోని 45 నిమిషాల సన్నివేశాలను తాను చూశానన్నారు. బాహుబలి తమిళనాడులోను అద్భుత విజయం సాధిస్తుందనే నమ్మకం తనకుందని పేర్కొన్నారు.

అందుకే అంత పెద్ద మొత్తంతో చిత్ర తమిళనాడు విడుదల హక్కులను కొనుగోలు చేసినట్లు చెప్పారు. బాహుబలి హిందీ హక్కులను ప్రముఖ బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దీంతో బాహుబలి మొదటి భాగం రిలీజ్ కి ముందే 100 కోట్ల రూపాయలను టచ్ చేయడం ఖాయం అని అంటున్నారు.

source:http://www.apherald.com/Movies/ViewArticle/77717/Baahubali-baahubali-tamil-mahaabali-mahaabali-news/

0 comments:

Post a Comment

 
Top