March 15, 2025 01:36:40 AM Menu
Latest

6:28 PM test1

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు కలలో కూడా ఊహించుకోని గౌరవం దక్కబోతోంది అన్న ప్రచారం ఫిలింనగర్ లో జరుగుతోంది. ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా వినిపిస్తున్న ఈ వార్తలు నిజం అయితే మహేష్ ఇమేజ్ మరో మెట్టు పైకి ఎదిగి పోతుంది. వినపడుతున్న వార్తల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మహేష్ బాబును నియమిస్తే బాగుంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా టెన్నిస్ స్టార్ సానియా మీర్జాను నియమించిన నేపధ్యంలో హైదరాబాద్ కు ప్రత్యేకంగా ఒక టాప్ సెలెబ్రెటీని బ్రాండ్ అంబాసిడర్ గా వేరుగా నియమిస్తే అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ కు గుర్తింపు తీసుకు రావాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు మంచి బలం చేకూరుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరి పెద్దల ఆలోచన అని టాక్.

హైదరాబాద్ అభివృద్ధిలో సాఫ్ట్ వేర్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది కాబట్టి ఆ రంగంలో పనిచేసే ఎంతో మంది మహేష్ ను అభిమానిస్తున్న నేపధ్యంలో మహేష్ భాగ్యనగరానికి బ్రాండ్ అంబాసిడర్ గా మారితే ఐటి రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయనే వ్యూహాత్మక ఎత్తుగడలో ఈ నిర్ణయం జరిగింది అని టాక్. వివాదాలకు దూరంగా ఉండటమే కాకుండా ఏ రాజకీయ పార్టీకి చెందని మహేష్ వ్యక్తిగత నేపధ్యం కూడా తెలంగాణ ప్రభుత్వం తీసుకో బోతున్న ఈ నిర్ణయoలో ప్రధాన పాత్ర పోషించింది అని అంటున్నారు.

ఒక వైపు మహేష్ తండ్రి కృష్ణను తెలంగాణ ప్రభుత్వం త్వరలో నిర్మించబోతున్న ఇంటర్ నేషనల్ ఫిలింసిటీ డైరెక్టర్ల బోర్డులో నియమిస్తాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే బహిరంగంగా చెప్పిన నేపధ్యంలో మహేష్ కూడా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ గా మారిపోతే ఘట్టమనేని వారి చిరునామా తెలంగాణ గా మారిపోతుంది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78577/IS-MAHESH-BECOMING-HYDERABAD-BRAND-AMBASSADOR-/
12 Feb 2015

0 comments:

Post a Comment

:) :)) ;(( :-) =)) ;( ;-( :d :-d @-) :p :o :>) (o) [-( :-? (p) :-s (m) 8-) :-t :-b b-( :-# =p~ $-) (b) (f) x-) (k) (h) (c) cheer
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.

 
Top