ఏ విషయం పైన అయినా తన అభిప్రాయాలను చాల సూటిగా సంచలనాత్మకంగా కామెంట్ చేసే ఇలియాన సహజీవం పై చేసిన కామెంట్స్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ మీడియాగా మారాయి. టాలీవుడ్ లో టాప్ హీరోఅలందరితో నటించి ఎన్నో హిట్స్ కొట్టిన ఇలియానా ప్రస్తుతం ఎక్కడా అవకాశాలు లేక దిగాలుగా కాలం గడుపుతోంది. తిరిగి మళ్ళీ దక్షిణాది పై దృష్టి సారించాలని ప్రయత్నిస్తూ అనేక తెలుగు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తనను తాను మళ్ళీ గుర్తుకు చేయడానికి ప్రయత్నించు కుంటోంది.
ఈ నేపధ్యంలో ఇలియానా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో సహజీవం పై సంచలనాత్మక కామెంట్స్ చేసింది. సహజీవం రైలు ప్రయాణం లాంటిదని అడినచ్చాకపోతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా దిగి పోవచ్చని కామెంట్స్ చేసింది ఇలియానా.
కానీ వివాహ బంధం విమాన ప్రయాణం లాంటిదని అది నచ్చకపోయినా గమ్యం చేరే వరకు వేచి చూడాలి కాని మధ్యలో దిగిపోతే అసలుకే మోసం వస్తుందని కామెంట్స్ చేసింది ఇలియానా. అందువల్లనే ఈరోజులలో చాలామంది పెళ్ళికన్నా సహజీవనం వైపు మొగ్గు చూపుతున్నారని షాకింగ్ కామెంట్స్ చేసింది ఇలియానా.
అయితే ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఆమెకు అవకాశాలు లేకపోవడంతో నిరాశతో ఇలా మాట్లాడుతోందా? లేదంటే పెళ్ళి పైన నిజంగానే ఇలీబేబీకి విరక్తి ఏర్పడిందా అనే విషయాలు రానున్న రోజులలో తేలుతాయి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78831/ILIYANA-SENSATIONAL-COMMENTS-ON-LIVING-RELATION-SHIP/
0 comments:
Post a Comment