Menu


ఎనర్జిటిక్ హీరోగా పేరు తెచ్చుకున్న రామ్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి 9 సంవత్సరాలు దాటి పోయినా ఇంకా హీరోగా పూర్తిగా నిలదొక్కుకోలేక పోతున్నాడు. గత రెండు సంవత్సరాలుగా వరస పెట్టి వస్తున్న పరాజయాలతో రామ్ పరిస్థితి మరీ అయోమయంలో పడిపోయింది. దీనితో రామ్ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ‘పండగ చేస్కో’ అనే సినిమాలో నటిస్తూ ఆ సినిమా పై చాల పెద్ద అంచనాలే పెట్టుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు గాంచిన రకుల్ ప్రీత్ ఈసినిమాలో రామ్ పక్కన నటిస్తోంది.

ఇప్పటికే ఈ సినిమా నిర్మాణం పూర్తి కావలసి ఉన్నా ఈ సినిమా మధ్యలో ఆగిపోయింది. అయితే చాలామంది ఇలా ఆగిపోవడానికి ఆర్ధక కారణాలు అని అనుకున్నారు. అయితే అసలు విషయం వేరే ఉందని టాక్. ఇప్పుడు ఆ విషయాలు బయటకు వస్తున్నాయి. ‘పండుగ చేస్కో’ సినిమాలోని కొన్ని సీన్స్ ఇంచుమించు గత దసరాకు వచ్చిన రామ్ చరణ్ ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను పోలి ఉంటాయట.

ఈ సినిమాలో కూడా రామ్ విదేశాల నుండి తన తాతను వెతుక్కుంటూ ఆంధ్రా ప్రాంతంలోని ఒక పల్లెటూరుకి వస్తాడట. అక్కడ జరిగే కథకు సంబంధించిన సన్నివేశాలు ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాను పోలి ఉండటంతో ఉలిక్కి పడ్డ రామ్ ఆ సన్నివేశాలకు సంబంధించిన స్క్రిప్ట్ ను పూర్తిగా మార్చి తన ‘పండగ చేస్కో’ సినిమాను వేరే విధంగా మార్చాడని టాక్.

దీనివల్ల స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు జరగడంతో షూటింగ్ లో గ్యాప్ వచ్చింది అని అంటున్నారు. ఇప్పుడు పక్కాగా స్క్రిప్ట్ తయారవడంతో ఫిబ్రవరి 3 నుంచి రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలలో ఈ షూటింగ్ ను తిరిగి ప్రారంభించబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విజయం కూడా రామ్ కెరియర్ కు అత్యంత కీలకంగా మారడంతో ఈ సినిమా పై ఎన్నో ఆసలు పెట్టుకున్నాడు రామ్.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77578/RAM-CHARAN-BECOMING-CAUTIOUS-TO-RAM-/

0 comments:

Post a Comment

 
Top