Menu

నందమూరి అభిమానుల కోలాహలం మధ్య నిన్న సాయంత్రం జరిగిన ‘టెంపర్’ ఆడియో వేడుక నందమూరి కుటుంబ టెంపర్ కు ప్రతిబింబంగా ఘనంగా జరిగింది. ఈ వేదిక నుంచి జూనియర్ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలుగా తాను నటిస్తున్న సినిమాలు తన అభిమానులకు నచ్చటంలేదు అన్న విషయం తనకు తెలుసని తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని తనని తాను కొత్తగా మార్చుకుని ఈ ‘టెంపర్’ చేసానని చెప్పాడు జూనియర్.

సినిమా జయాపజయాలతో తనకు సంబంధం లేదని తన అభిమానులకు నచ్చే వరకు ఇలా సినిమాలు చేస్తూనే ఉంటానని షాకింగ్ కామెంట్స్ చేసాడు జూనియర్. ‘పటాస్’ తో మొదలైన 2015 ‘టెంపర్’, ‘లయన్’ మూడు అక్షరాల సినిమాల సెంటిమెంట్ తో ఈ సంవత్సరం నందమూరి నామ సంవత్సరంగా మారిపోతుందని జూనియర్ సంచలన వ్యాఖ్యలు చేసాడు.

ఇది ఇలా ఉండగా నిన్న విడుదలైన ‘టెంపర్’ సినిమాలోని పాటలు, టీజర్ నందమూరి అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తూ ఈ సినిమా పై అంచనాలు పెంచుతున్నాయి. టెంపర్ టైటిల్ సాంగ్ నందమూరి ఫ్యాన్స్‌లో ఆసక్తిని రేపుతోంది. “నీ తాత టెంపర్, నీ అయ్య టెంపర్, బాబాయి టెంపర్, నువ్వింకా టెంపర్” అంటూ సాగిన టైటిల్ సాంగ్‌ ‘టెంపర్’ కు హైలెట్ గా నిలుస్తోంది.

ఇది ఇలా ఉండగా ఈ సినిమా టీజర్ లో కాజల్ జూనియర్ ల మధ్య వచ్చిన డైలాగ్స్ ‘మా కుక్కలు క్రాసింగ్ కు వచ్చాయి, మీరు కొంచెం హెల్ప్ చేస్తారా’ అన్న కాజల్ మాటలకు ‘ఇక్కడ మేమూ క్రాసింగ్ కు వచ్చి చాలా కాలమైంది, మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు’ అంటూ జూనియర్ ఇచ్చిన సమాధానం యూత్ ను బాగా ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ఏది ఎలా ఉన్నా నిన్నటి నుంచి నందమూరి అభిమానులలో ఈ ‘టెంపర్’ విపరీతంగా టెంపరేచర్ పెంచేస్తోంది.

source:http://www.apherald.com/MOVIES/ViewArticle/77356/TEMPER-BECOMING-NANDAMURI-YEAR/

0 comments:

Post a Comment

 
Top