హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వివిధ వెబ్ సైట్లలో సినిమా రివ్యూలు చదివారు. అసలు ఆయనకు ఇలాంటి అలవాటు లేదుకానీ, తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘పిల్లా నువ్వు లేని జీవితం' ఇటీవల విడుదలైన నేపథ్యంలో అతడి పెర్ఫార్మెన్స్‌పై మీడియా టాక్ ఎలా ఉందనే విషయం తెలుసుకోవడానికి ఆయన రివ్యూలు చదివారు. అతని తెరంగ్రేటంపై పబ్లిక్ టాక్ టాక్ ఎలా ఉంది? సినిమాపై పబ్లిక్ ఫీడ్ బ్యాక్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకోవడానికి ఆయన రివ్యూలపై ఆదారపడ్డారు. ఈ విషయాన్ని సాయి ధరమ్ తేజ్ స్వయంగా వెల్లడించారు. అంతే కాదు ‘పిల్లా నువ్వు లేని జీవితం' సినిమా చూసి సినిమా బావుందని, సాయి ధరమ్ తేజ్ పెర్ఫార్మెన్స్ బాగుందని, డాన్స్ బాగా చేసావని ప్రశంసించారట.
రెజీనా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు కెఎస్. రవికుమార్ చౌదరి దర్శకత్వం వహించగా అల్లు అరవింద్, దిల్ రాజు నేతృత్వంలో బన్నీవాసు, హర్షిత్ నిర్మించారు. ఏపి, నైజాం కలెక్షన్స్ కలిపి తొలి వారాంతం ముగిసే నాటికి 5.18 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సాయి ధరమ్ తేజ నటుడిగా నిలబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. డాన్సులు, ఫైట్స్ బాగా చేశాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ బాగున్నాయి. అయితే తమ మేనమామలు చిరంజీవి, పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ నుండి వీలైనంత త్వరగా బయటకు వస్తే మంచిదని అంటున్నారు.
http://telugu.filmibeat.com/news/pawan-kalyan-reads-pilla-nuvvu-leni-jeevitham-review-042170.html
0 comments:
Post a Comment