Menu



ఈ సంవత్సరం అల్లుఅర్జున్ కు కలిసి వచ్చినంతగా టాలీవుడ్ లో ఏ హీరోకు అంతగా కలిసిరాలేదు. బన్నీ కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ గా నిలిచి అల్లుఅర్జున్ ను టాప్ 4 హీరోల స్థానంలో కూర్చో పెట్టిన ‘రేసు గుర్రం’ ఈ సంవత్సరమే విడుదల అయింది అన్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఇదే సంవత్సరం బన్నీ అయాన్ కు తండ్రి అయ్యాడు. ఇక్కడితో ఆగకుండా బన్నీకి మరో అదృష్టం తన ఇంట నిలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫిలిం ఫేర్ అవార్డుల తరువాత సినిమా సెలెబ్రెటీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ‘సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్’ (సీమా అవార్డ్స్) ‘హూ ఈజ్ మోస్ట్ స్టైలిష్ హీరో ప్యానల్’ లో అల్లుఅర్జున్ ఎంపిక కావడo సంచలనంగా మారింది.  ఈ ప్యానల్ లో బన్నీతో పాటు కోలీవుడ్ టాప్ హీరో సూర్య, కన్నడ టాప్ హీరో పృధ్వీ రాజ్, హీరో యాష్ లు కూడ ఉండటంతో బన్నీ ప్రతిష్టాత్మకమైన ఈ స్టైలిష్ హీరో అవార్డును అందుకుంటాడా? అనే ఊహాగానాలు అప్పుడే మొదలైపోయాయి. తన అభిమానులచేత స్టైలిష్ స్టార్ గా పిలిపించుకునే బన్నీ నిజంగా ఈ స్టైలిష్ హీరో అవార్డును అందుకోగలిగితే దక్షిణాది టాప్ యంగ్ హీరోలకు ముఖ్యంగా కోలీవుడ్ టాప్ హీరో సుర్యాకు గట్టి షాక్ అనుకోవాలి.

0 comments:

Post a Comment

 
Top