నిన్న విడుదలైన ‘గడ్డం గ్యాంగ్’ ప్రేక్షకులకు నచ్చక పోవడంతో రాజశేఖర్ కోరుకున్న విజయం ఈ సినిమా ద్వారా లభించలేదు అనే విషయం స్పస్టమైపోయింది. నటుడిగా రాజశేఖర్ కు ఈ సినిమాకు సంబంధించి మంచి మార్కులే పడినా ఈ సినిమాలో ఎక్కడా తెలుగు నేటివిటీ కనిపించకుండా అంతా ఈ సినిమాకు మాతృక అయిన ‘సూదు కవ్వుం’ తమిళ సినిమాకు కాపీ అండ్ పేస్ట్ గా మారడం ఈ సినిమా పరాజయానికి ఒక ప్రధాన కారణం అని అంటున్నారు.
అంతేకాకుండా ఈ సినిమాలో రాజశేఖర్ భారీ డైలాగులు, ప్రాసలు, పంచ్ లు వాడటం అవి కూడా సాయికుమార్ బేస్ వాయిస్ తో డబ్బింగ్ చెప్పించడం ఈ సినిమాకు మైనస్ పాయింట్ గా మారి ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు ఇలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కు సంబంధించి మీడియాతో మాట్లాడుతూ రాజశేఖర్ చేసిన కామెంట్స్ చాలామందికి నవ్వును, ఆశ్చర్యాన్ని కలిగించాయి.
ఇక తాను వరస పెట్టి సినిమాలు చేయబోతున్న విషయాన్ని ప్రస్తావిస్తూ తాను కూడా బాలీవుడ్ హాట్ బ్యూటి సన్నీ లియోన్ తో నటించాలని ఉంది అని తన మనసులో మాట బయట పెట్టాడు రాజశేఖర్. అయితే బహుశా తన కోరికను తన భార్య జీవిత అంగీకరించక పోవచ్చని తన పై తానే సెటైర్లు వేసుకున్నాడు.
ఈ మాటలు మీడియాకు నవ్వు తెప్పించినా జీవితకు మాత్రం షాక్ ఇస్తాయి అన్నది వాస్తవం. ఇంతకీ రాజశేఖర్ కోరికను జీవిత నేరవేరుస్తుందో లేదో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/78112/RAJASEKHAR-COMMENTS-GOT-SHOCKED-TO-JEEVITHA/

0 comments:
Post a Comment