Menu

ఒకనాటి టాలీవుడ్ బాలీవుడ్ టాప్ హీరోయిన్ జయప్రద సిస్టర్స్ గా తమన్నా, కాజల్ లు మారిపోయి ప్రముఖ రాజకీయ వేత్త నిర్మాత టి. సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్ళిలో చేసిన హడావిడి అందర్నీ ఆకర్షించడమే కాకుండా ఆశ్చర్య పరిచింది. ఎందరో ప్రముఖ రాజకీయ వేత్తలు అనేక మంది సినిమా సెలిబ్రెటీలు ఆహ్వానితులుగా ఈ పెళ్ళికి వచ్చి సుబ్బిరామిరెడ్డి మనవడిని ఆశీర్వదించారు.

అయితే ఎంతో ఘనంగా జరుగుతున్న ఆ పెళ్ళిలో వారంతా పాల్గొంటూ ఆ పెళ్లిని ఎంజాయ్ చేస్తున్నా అందరి దృష్టి మాత్రం ఒక సోఫాలో కూర్చుని ఒకరి చేతిలో మరొకరి చేయి పట్టుకుని ఆప్యాయంగా కబుర్లు చెప్పుకుంటూ జోక్స్ వేసుకుంటూ ఎంతో పరిచయం ఉన్న స్నేహితులులా జయప్రద, కాజల్, తమన్నాలు చేసిన సందడి సుబ్బిరామిరెడ్డి మనవడి పెళ్ళికి హైలెట్ గా మారింది.

అయితే ఈ దృశ్యాన్ని చూసిన వారంతా యంగ్ హీరోయిన్స్ తమన్నా కాజల్ లు ఆ తరానికి చెందిన జయప్రదకు సమవయస్కులుగా మారిపోయారా లేదంటే ఈ తరానికి చెందిన కాజల్ తమన్నాల సమవయస్కురాలిగా జయప్రద మారి పోయిందా అని జోక్ చేసుకోవడం ఆ పెళ్ళిలో వినిపించింది అని టాక్. మరి కొందరైతే ఈ ముగ్గురి అనుబంధాన్ని చూస్తూ ఉంటే అక్క చెల్లెళ్ళులా మారిపోయారు అంటూ జోక్ చేసుకున్నారట.

త్వరలో జయప్రద నిర్మాతగా మారి హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలను తీస్తాను అని చెపుతోంది కాబట్టి ఈ ముగ్గురి హీరోయిన్స్ తో త్వరలో ఒక మంచి మల్టీ స్టారర్ మూవీ వస్తుందేమో చూడాలి.

source:http://www.apherald.com/Movies/ViewArticle/78113/TAMANNAH-AND-KAJAL-BECAME-JAYAPRADA-SISTERS/

0 comments:

Post a Comment

 
Top