బాలకృష్ణ 99వ సినిమాగా రూపొందుతున్న ‘డిక్టేటర్’ టాలీవుడ్ సినిమా రంగంలో ఒక కొత్త సాంప్రదాయానికి తెర తీయబోతోంది. ఈ పద్ధతిని దక్షిణాదిన ఈరోస్ సంస్థ వ్యవహారాలను చూస్తున్న రజినీకాంత్ కుమార్తె సౌoదర్య ఆధ్వర్యంలో డిజైన్ చేయబడింది అని టాక్. వినపడుతున్న వార్తల ప్రకారం బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ‘డిక్టేటర్’ సినిమాకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు టాపిక్ ఆఫ్ టాలీవుడ్ గా మారింది.
ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను నిర్వర్తిస్తున్న ఈరోస్ ఈ సినిమా నిర్మాణంలో మొదటి నుంచి అన్ని విషయాలలోనూ భాగస్వాములుగా ఉండటమే కాకుండా ఈ సినిమా దర్శకుడు శ్రీవాస్ ను కూడా అధికారికంగా భాగస్వామిగా చేస్తూ, నిన్ననే ఒక ఎగ్రిమెంట్ పై సంతకాలు తీసుకున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఒక దర్శకుడిని భాగస్వామిగా చేసి అధికారికంగా నిర్మిస్తున్న తొలి సినిమాగా ‘డిక్టేటర్’ రికార్డు చేయబోతోంది.
బాలకృష్ణకు సెంటిమెంట్ గా కలిసి వచ్చిన నయనతారను హీరోయిన్ గా పెట్టి ఈ సినిమాను నిర్మిచ బోతున్నారు. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈసినిమాలో మరో హీరోయిన్ గా హన్సిక ను కాని లేదేంటే తమన్నాను కాని హీరోయిన్ గా ఈ సినిమాకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు టాక్.
మార్చి నెలాఖరుకు ఈ సినిమా షూటింగ్ ను మొదలుపెట్టి వేగంగా షూటింగ్ పూర్తి చేసి దసరాకు విడుదల చేసే ఉద్దేశ్యంలో ఈ సినిమా యూనిట్ ఉంది అని వార్తలు వస్తున్నాయి. ఒక కొత్త పద్ధతికి తెర తీస్తున్న ఈ విధానం విజయవంతం అయితే ఈ పద్ధతిలో చాల భారీ సినిమాలు నిర్మాణం అయ్యే అవకాశం ఉంది.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78124/DICTATOR-SENSATIONAL-NEWS/
0 comments:
Post a Comment