2015వ సంవత్సరం, సంక్రాంతి పండుగకి ఆశించినంత తెలుగు మూవీలు రిలీజ్ కాలేదు. దీంతో సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ అయిన గోపాల గోపాల మూవీకి భారీ రెస్పాన్స్ రావడమే కాకుండా, ఫ్యామిలీ నెంబర్స్ అంతా ఈ మూవీనే సెలక్ట్ చేసుకోవడంతో కలెక్షన్స్ పరంగా, గోపాలుడికి తిరుగులేకుండా పోయింది. గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ ఫిల్మ్ టెంపర్, ఈ సంక్రాంతి పండుగకే రిలీజ్ కావాల్సి ఉండగా, షూటింగ్ షెడ్యూల్స్ డిలే కారణంతో, రిలీజ్ కాస్త వాయిదా పడింది. దీంతో సంక్రాంతి పండుగ ఒకటి, రెండు ఫిల్మ్స్ తోనే సరిపెట్టుకోవల్సి వస్తుంది.
అయితే తాజాగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు, ప్రిన్స్ మహేష్ బాబు ఈ సంక్రాంతికి వస్తున్నాడంటూ టాలీవుడ్ లో క్లియర్ టాక్స్ వినిపిస్తున్నాయి. తను నటిస్తున్న అప్ కమింగ్ చిత్రం శ్రీమంతుడు, సంక్రాంతికి రిలీజ్ అవుతుందని కాదు. తను నటిస్తున్న శ్రీమంతుడు చిత్రంకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని, సంక్రాంతి పండుగ రోజున రిలీజ్ చేయబోతున్నారు. దీంతో మహేష్ బాబు అభిమానులకి, ఈ సంక్రాంతి పండుగ నాడు వస్తున్న శ్రీమంతుడు టీజర్ అలరించనుంది. శ్రీమంతుడు మూవీకి మిర్చి ఫేం కొరటాలశివ దర్శకుడిగా ఉంటున్నాడు. అలాగే ప్రిన్స్ సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తుంది.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76010/MAHESHBABU-SREE-MANTHUDU-TOLLYWOOD-SRUTHI-HAASAN-M/

0 comments:
Post a Comment