Menu


ప్రిన్స్ మహేష్‌బాబు సరసన అతిథి చిత్రంలో నటించిన అమృతారావ్ గుర్తుందా. ఇష్క్ విష్క్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె అనతి కాలంలోనే మంచి హీరోయిన్‌గా గుర్తింపుపొందింది. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన అతిథి సినిమాలో ఆమె హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది. తాజాగా అమృత తన బాయ్‌ఫ్రెండ్ రేడియో జాకీ అన్మోల్‌ని వివాహమాడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని ఎవ్వరూ అధికారంగా ధృవీకరించలేదు. 

ముంబైలోని వెర్సావాలో తల్లిదండ్రులతో కలిసి ఉండే అమృత ఇటీవల ముంబైలోని వలోకాలో ఉంటోందట. అది అన్మోల్ ఇల్లు అని టాక్. ఇటీవల అన్మోల్ అనారోగ్యానికి గురైతే ఆమె ఆ ఇంటి నుంచే ఆన్మోల్ ఉన్న ఆసుపత్రికి వెళ్లడం రావడం.... ఇరుగు పొరుగు వారి కళ్లలో పడిందట. వారిద్దరికి పెళ్లి కూడా అయిపోయిందని బాలీవుడ్‌లో టాక్ వినపడుతోంది. అయితే అమృత ఈ విషయాన్ని ఎందుకు రహస్యంగా దాస్తోందన్నది తెలియడం లేదు.

source:http://www.pallibatani.com/telugu/view-4045-telugu-cinema-gossips-maheshbabu-heroine-secret-marrige-with-boyfriend.html

0 comments:

Post a Comment

 
Top