Menu

trivikram-nithya-menon
టాలీవుడ్  ఇండస్ట్రీలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చాలా కూల్ గా కనిపించే డైరెక్టర్ . ఈ విషయం  మీడియా ఫంక్షన్స్ కు తను హాజరు అయినప్పుడు అర్ధం అవుతుంది. అందరూ త్రివిక్రమ్ ని చూసి చాలా కూల్ పర్సన్ అని అనుకుంటారు. కాని నిజానికి త్రివిక్రమ్ చాలా కోపంగా ఉంటాడనే విషయం తాజాగా అందరికి అర్ధం అయింది.

త్రివిక్రమ్ అప్ కమింగ్ మూవీకి సంబంధించిన షూటింగ్ లో ఈ విషయం బయటపడింది. టాలీవుడ్ లో తనదైన శైలితో కెరీర్ లో చెప్పుకోదగ్గ హిట్స్‌‌ అందుకున్న నిత్యామీనన్, స్టార్ డం ని మాత్రం పూర్తి స్థాయిలో సంపాదించుకోలేక పోయింది. కుర్ర హీరోలతోనే ఎక్కువగా నటించే ఈ ముద్దుగుమ్మకు స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌ శ్రీనివాస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే.

అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలో ఈ బ్యూటీకి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చేశాడు త్రివిక్రమ్ . సినిమాలో మెయిన్ హీరోయిన్‌ కాకపోయినా, ముఖ్యమైన పాత్రను ఈ కేరళ కుట్టికి ఇచ్చాడట త్రివిక్రమ్‌ శ్రీనివాస్. అంతేకాదు ఈ మూవీలో నటించేందుకు అమ్మడికి భారీ పారితోషికాన్ని ఇచ్చేలా ఒప్పించాడట ఈ స్టార్ డైరెక్టర్. అయితే ఏరికోరి ఎంచుకున్న నిత్యామీనన్‌, త్రివిక్రమ్‌ను తెగ ఇరిటేట్ చేస్తోందని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి.

త్రివిక్రమ్ తన స్క్రిప్ట్ ని ఒకటి రెండు రోజుల ముందుగా మాత్రమే లీడ్ యాక్టర్స్ కి ఇస్తాడు. కాని నిత్యామీనన్ మాత్రం, తనకు సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ మొత్తం కావాలని గొడవ చేస్తుంది. అలా అయితేనే తను మూవీకి న్యాయం చేయగలని, లేకపోతే సరిగా యాక్ట్ చేయలేనని చెప్పుకొస్తుంది. ఇందుకు త్రివిక్రమ్ అస్సలు ఒప్పుకోవడం లేదంట.

0 comments:

Post a Comment

 
Top