Menu


హీరోయిన్‌ త్రిషకి వరుణ్‌ మణియన్‌తో ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఇద్దరూ ప్రేమించుకున్నారు, పెద్దల్ని ఒప్పించి, పెళ్ళి పీటలెక్కబోతున్నారు. పెళ్ళికి సరిగ్గా కొన్ని రోజుల ముందు స్నేహితుల్ని వెంటేసుకుని, వరుణ్‌తో కలిసి దేశలోని వివిధ ప్రాంతాల్లో లగ్జరియస్‌గా ప్యటించింది త్రిష. పెళ్ళి కుదిరిందనే ఆనందంలో ఫ్రెండ్స్‌కి ఖరీదైన నైట్‌ పార్టీలు కూడా ఇచ్చిన త్రిష, ఎంగేజ్‌మెంట్‌ అయ్యాక ఇంకా హ్యాపీగా నైట్‌ పార్టీలతో టైమ్‌ స్పెండ్‌ చేస్తుంది. 

త్రిష నైట్‌ పార్టీల్లో సినీ సెలబ్రిటీస్‌ ఎక్కువగా కనిపించడం వెనుక కొత్త కోణాన్ని బయటకు లాగింది తమిళ మీడియా. అదేంటంటే, వరుణ్‌ మణియన్‌ సినీ నిర్మాతగా ఎదుగుతున్న వ్యక్తి కావడంతో, భవిష్యత్తులో భర్తతో కలిసి సినిమాలు నిర్మించాలనే ఆలోచనతో ఉన్న త్రిష, సినీ సెలబ్రిటీస్‌ని టచ్‌లో ఉంచుకునేందుకే ఇవన్నీ చేస్తుందట. త్రిషకి టాలీవుడ్‌లో రాణా సహా కొందరు మంచి ప్రెండ్స్‌ ఉన్నారు. బాలీవుడ్‌లో అక్షయ్‌కుమార్‌తో పరిచయాలున్నాయి. తమిళ్‌లో పెద్దదే ఉంది ఆమె ఫ్రెండ్స్‌లిస్ట్‌. వీళ్ళందరికీ పార్టీలు ఇస్తూ, టచ్‌లో ఉంటున్న త్రిష మహా ముదురే. 

source:: http://telugu.gulte.com/tmovienews/8507/Varun-Using-Trisha-Popularity#sthash.tVeZ2yIz.dpuf

0 comments:

Post a Comment

 
Top