ఎన్టీఆర్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో రానున్న 'టెంపర్'పై ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హై రేంజ్‌లో ఉన్నాయి. కొత్తగా సినిమాపై హైప్ క్రియేట్ అవడానికేం లేదు. ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్, 'దయాగాడి దండయాత్ర' డైలాగ్ ఇవన్నీ సినిమాపై హైప్‌ని పీక్స్‌కి తీసుకెళ్ళిపోయాయి. లేటెస్ట్‌గా ఛార్మితో సినిమా చేయనున్నట్లు పూరి ప్రకటించేసరికి, 'టెంపర్'కి అదనంగా పబ్లిసిటీ తోడయ్యింది. 'జ్యోతిలక్ష్మి' అనే సినిమాని పూరి అనౌన్స్ చేశాడు ఛార్మితో తీయబోతున్నట్లు చెబుతూ.
లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఛార్మి ఒకానొక టైమ్‌లో ట్రెండ్ సృష్టించింది. 'అనగనగా ఒక రోజు', 'మంత్ర' సినిమాలు ఛార్మిని ఎక్కడికో తీసుకెళ్ళాయి. కానీ ఆ తర్వాత ఛార్మి కెరీర్‌లో డీలాపడింది. ఇప్పుడేమో పూరి, ఛార్మికి 'జ్యోతిలక్ష్మి'తో లిఫ్ట్ ఇవ్వబోతున్నాడు. 'జ్యోతిలక్ష్మి' న్యూస్ బయటకు రాగానే, ఛార్మికీ పూరికి ఎఫైర్ అంటూ గాసిప్స్ స్టార్ట్ అయ్యాయి. 'నాకా ఛార్మితోనా ఎఫైరా?' అని నవ్వేశాడట పూరి. ఈ గాసిప్స్, 'జ్యోతిలక్షి' మూవీ, ఇవన్నీ ఇన్ డైరెక్ట్‌గా 'టెంపర్'కీ ఎంతో కొంత మేలు చేస్తాయంటున్నారు. పూరి మీద గౌరవంతో ఉడతాభక్తిగా ఛార్మి, 'టెంపర్'కి అదనంగా ఇంకేమన్నా పబ్లిసిటీ ఇస్తుందేమో చూడాలిక.
source: http://telugu.gulte.com/tmovienews/8508/Charmee-Gossips-Give-New-Kick-To-Puri-Temper#sthash.qlYG1DKI.dpuf

0 comments:
Post a Comment