అఖిల్ టాలీవుడ్ ఎంట్రీ గురించి ఎంతగానో ఎదురుచూసిన అక్కినేని అభిమానులే
ఇప్పుడు ఒక కొత్త కలవర పాటుతో ఉలిక్కి పడుతున్నారు అని టాక్. దీనికి కారణం
ప్రస్తుతం అఖిల్ ప్రదర్శిస్తున్న అత్యుత్సాహమే అని కొందరి అక్కినేని
వీరాభిమానుల వాదన. వారి విశ్లేషణల ప్రకారం అఖిల్ ప్రతిరోజు తన ట్విటర్ లో
తాను లేటెస్ట్ గా నటిస్తున్న తన మొదటి సినిమా వివరాలను తన అభిమానులతో షేర్
చేసుకుంటూ వెబ్ మీడియాలో హడావిడి చేయడం కారణం అని అంటున్నారు.
తన సినిమాకు హీరోయిన్ గా సాయేష ఎంపిక అయిన దగ్గర నుంచి ఆ సినిమా సంబంధించిన మినిట్ టు మినిట్ వివరాలను తన ట్విటర్ లో తెలియచేస్తూ ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు పెరిగి పోతున్నాయని అక్కినేని వీరాభిమానుల వాదన. గతంలో నాగచైతన్య హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జోష్ సినిమా విషయంలో కూడా పెరిగిన అంచనాలను ఆ సినిమా అందుకోలేక పోవడంతో ఆసినిమా చైతు కెరియర్ కు మొట్టమొదటి షాక్ ఇచ్చింది అని అక్కినేని అభిమానుల వాదన.
ఈ నేపధ్యంలో ఇప్పుడు అఖిల్ నటిస్తున్న తన తొలి సినిమా విషయాలను ప్రతి రోజు తెలియచేస్తూ ఉండటంతో ఈ సినిమా పై కూడ విపరీతమైన అంచనాలు పెరిగిపోయి ఏ మాత్రం తేడా జరిగిన భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని అక్కినేని అభిమానుల భయం అనే వార్తలు వినిపిస్తున్నాయి.
మాస్ సినిమాలను తీసే వినాయక్ చేతిలో లవర్ బయ్ ఇమేజ్ ఉన్న అఖిల్ ఎందుకు పడ్డాడా అని కొందరు అభిమానులు భయపడుతున్న నేపధ్యంలో ఇప్పుడు అఖిల్ ఏకంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా బయటకు రాకుండా మరీ ఎక్కువ ఈ సినిమా విషయాలను బయటకు లీక్ చేయడం మంచిది కాదు అన్నది అక్కినేని అభిమానుల వాదన. మరి ఈ మాటలు నాగ్ వరకు చేరుకుంటాయో లేదో చూడాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/79066/AKHIL-PROMOTION-BECOMING-SHOCKING-TO-AKKINENI-FANS-/

0 comments:
Post a Comment