టాలీవుడ్ లో ప్రస్తుతం ఒక సునామీలా చొచ్చుకు పోతున్న రకుల్ ప్రీత్ ఈమధ్య ఇచ్చిన షాకింగ్ ప్రవర్తన పై ఫిలింనగర్ లో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. సామాన్యంగా టాప్ హీరోయిన్స్ వారు టాప్ హీరోలతో నటించిన సినిమాల ఆడియో ఫంక్షన్స్ లో మాత్రమే కనిపిస్తూ ఉంటారు. లేదు అంటే ఏదైనా ఒక ప్రముఖ షోరూమ్ ల ఫంక్షన్స్ లో అతిధిగా వచ్చి సందడి చేస్తూ ఉంటారు. కాని రకుల్ తాను నటించకపోయినా సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘టైగర్' ఆడియో ఫంక్షన్ కి రావడమే కాకుండా ఆ కార్యక్రమంలో సందడిగా కనిపించడం ఇప్పుడు ఫిలింనగర్ గాసిప్పు రాయుళ్ళకు మంచి సంచలన వార్తగా మారింది.
‘టైగర్’ ఆడియో ఫంక్షన్ కు వచ్చిన అతిధులలో ఒకరిగా రకుల్ ప్రీత్ సింగ్ వచ్చినా అందరి దృష్టి మాత్రం ఆమె పైనే పడింది. రెడ్ కలర్ చీర కట్టుకుని గ్లామరస్ గా మేకప్ చేసుకుని వచ్చిన రకుల్ చుట్టూనే మీడియా కెమెరాలు తిరిగాయి. దీనితో ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సీరత్ కపూర్‌ని ఎవరూ అంతగా పట్టించుకునే వారు లేకపోవడం అందర్నీ ఆశ్చర్య పరిచింది.
సర్వ సాధారణంగా వేరే హీరోలు నటించిన ఆడియో ఫంక్షన్స్ కు రాకుండా దూరంగా ఉండే రకుల్ పనికట్టుకుని ‘టైగర్’ ఆడియో వేడుకకు రావడంతో ఈ విషయాన్ని మీడియా ప్రతినిధులు చాలా డీప్ గా ఆ ఆడియో వేడుకలో చర్చించుకున్నారు అని టాక్. అంతేకాదు ఈమధ్య సందీప్ కిషన్ హీరోగా నటించిన సినిమాల వేడుకల్లో తరచుగా రకుల్ ప్రీత్ సింగ్ కనిపిస్తోందని వార్తలు వస్తున్నాయి.
‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో సందీప్ కిషన్ తో నటించి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రకుల్ ఇప్పుడు టాప్ హీరోయిన్ గా మారిపోయినా సందీప్ కిషన్ తో తన స్నేహాన్ని కొనసాగిస్తోంది అని టాక్. మరి వీరిద్దరి స్నేహం రానున్న రోజులలో ఏ స్థాయికి చేరుకుంటుందో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/79225/STRATEGY-BEHIND-RAKUL-PREETH-BEHAVIOUR/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.