అమీర్ ఖాన్ ‘పీకే’ మూవీలో అమీర్ గాంధీబొమ్మతో ఉన్న కాగితాలు అన్నీ కరెన్సీగా భావించి వాటిని తీసుకుని వస్తువులు ఇమ్మంటాడు. అయితే గాంధీ బొమ్మ కరెన్సీ నోటు పై ఉంటేనే విలువ కాని వేరే కాగితాల పై ఉంటే ఆ గాంధీ బొమ్మకు విలువలేదు అని ఒక షాపు ఓనర్ పాత్ర చేత చెప్పిస్తాడు. ఈ సీన్ చూసి ప్రభావితం అయి కాబోలు దర్శకుడు పూరి జగన్నాథ్ ‘టెంపర్ సినిమాలో గాంధీ పై రాసిన పవర్ ఫుల్ డైలాగ్ కు సెన్సార్ కత్తెర పడినట్లు తెలుస్తోంది.
ఇక వివరాలలోకి వెళ్ళితే ఈసినిమాలో జూనియర్ ఒక సీన్ లో ‘గాంధీ గాంధీ అని అరవడం కాదు. ఈ దేశంలో జరిగే ప్రతీ అవినీతికి మొదటి సాక్షి ఈ గాంధీ’ అనే డైలాగ్ ఉందట. ఈ డైలాగ్ ను పూరి ఎంతో ఆలోచించి రాయడంతో ఈ డైలాగ్ అంటే పూరీకి బాగా ఇష్టం అని టాక్.
అయితే సెన్సార్ వారు మాత్రం ఈ డైలాగ్ వల్ల రకరకాల వివాదాలు వస్తాయని గాంధీ పేరుతో కొనసాగుతున్న ఒక ప్రముఖ రాజకీయ కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నట్లుగా ఈ డైలాగ్ అర్ధం కలిగిస్తుందని సెన్సార్ కామెంట్ చేసినట్లు టాక్. దీనితో తనకు ఇష్టం లేకపోయినా పూరి అయిష్టంగానే ఈ డైలాగ్ తొలిగించడానికి ఒప్పుకున్నాడట.
దేశంలో జరుగుతున్న అన్యాయాల పై పూరి వెలుబుచ్చిన ఆవేశం జనంలోకి వెళ్ళకుండా సెన్సార్ కత్తిరతో మరొకసారి గాంధీ మాట మూగపోయింది అనుకోవాలి.
source:http://www.apherald.com/MOVIES/ViewArticle/78543/GANDHI-THOUGHT-IN-TEMPER/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.