జాతీయ పండుగ రిపబ్లిక్ డే నాడు నందమూరి అభిమానులకు నందమూరి హడావిడి కనువిందు చేయబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా తమదైన ముద్ర వేసుకున్న నందమూరి హీరోలు వచ్చే వారం రాబోతున్న రిపబ్లిక్ డే నాడు మరో కొత్త హంగామాకు తెర తీయబోతున్నారు.
ఫిలింనగర్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఇప్పటికే అనేకసార్లు వాయిదా పడ్డ ఎన్టీఆర్ ‘టెంపర్’ ఆడియో వేడుకను ఆరోజు హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో నిర్వహించడానికి నిశ్చయించినట్లు టాక్. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆడియో వేడుకకు బాలకృష్ణ అతిధిగా రావడానికి అంగీకరించాడు అనే వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నాయి. ఈసినిమాను ఏ మాత్రం వీలున్నా ఫిబ్రవరి 5వ తారీఖున లేకపోతే ఫిబ్రవరి 12న విడుదల చేస్తారు అనే వార్తలు వినపడుతున్నాయి.
ఒక వైపు ఫిబ్రవరి రెండవ వారంలో మొదలు కాబోతున్న క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్ ల హడావిడితో పాటు పరీక్షల సీజన్ కూడా దగ్గర పడుతూ ఉండటంతో జూనియర్ తన ‘టెంపర్’ విడుదల విషయంలో పొరపాటు చేస్తున్నాడా అనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. అయితే ధైర్యానికి చిరునామా నందమూరి కుటుంబం కాబట్టి ఈ విషయంలో జూనియర్ వెనక అడుగు వెయ్యడు అని జూనియర్ సన్నిహితులు అంటున్నారు.
ఈ సినిమాకు సంబంధించి బిజినెస్ పరంగా క్రేజ్ పెంచడానికి నైజాం, గుంటూరు ఏరియాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఎన్టీఆర్, పూరీ తీసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాలలో వార్తలు వస్తూ ఉండటంతో మిగతా ఏరియాలలో కూడా ఈసినిమా మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. మరి ఈసారి అయినా వినపడుతున్న డేట్స్ కు ‘టెంపర్’ ఏమి చేస్తుందో చూడాలి.
source:http://www.apherald.com/Movies/ViewArticle/76673/NANDAMURI-HUNGAAMA-ON-REPUBLIC-DAY/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.