కొన్నిరకాల వంటలు చేయడంలో జూనియర్ ను మించిన వారు లేరు అని అతని సన్నిహితులు అంటారు. ఈ మధ్య ‘టెంపర్’ షూటింగ్ సమయంలో జూనియర్ కు కొద్ది గ్యాప్ దొరకడంతో ప్రకాష్ రాజుకు చెందిన ఫామ్ హౌస్ లోసరదాగా కొన్ని రకాల వంటలు చేసి చాలామందికి షాక్ ఇచ్చాడట. ఈ విషయానికి సంబంధించన ఫోటోలను ప్రకాష్ రాజ్ భార్య పోనీ వర్మ తన సోషల్ నెట్వర్కింగ్ పేజీలో షేర్ చేసింది.
ప్రకాష్ రాజ్‌కు చెందిన ఫాం హౌస్‌లో తరచూ సినిమా వాళ్ళతో కలిసి పార్టీలు జరుగుతుంటాయి అని టాక్. చాలామంది సినిమా సెలెబ్రెటీలు తరుచు అక్కడ కలుసు కుంటూ సినిమాలకు సంబంధించిన విషయాలు మాట్లాడు కుంటూ తీరిక సమయాన్ని గడపడం చాల మందికి అలవాటు అనే వార్తలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈమధ్య కాలంలో సరదాగా ప్రకాష్ రాజ్ ఫామ్ హౌస్ కు వెళ్ళిన జూనియర్ వంటలలో తన టాలెంట్ ను చూపెడుతూ రకరకాల్ వంటలు చేసి పెడుతున్న ఈ ఫోటోలు ప్రస్తుతం వెబ్ మీడియాకు హాట్ టాపిక్ గా మారాయి.
జూనియర్ అభిమానులు వంటలు చేస్తున్న తమ అభిమాన హీరో ఫోటోలను లైక్ చేస్తూ ఒకరికి ఒకరు షేర్ చేసుకుంటున్నారు. నందమూరి హీరోలు మనసు పెడితే ఏ విషయాలో అయినా ముందు వరసలోనే ఉంటారు అని ఈ ఫోటోలు మరొక సారి రుజువు చేస్తున్నాయి..
source:http://www.apherald.com/Movies/ViewArticle/77058/JUNIOR-COOKING-TALENT-BECAME-ASTONISHING/
0 comments:
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.