హైదరాబాద్: సినిమాల కంటే ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో ఉండే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. త్వరలో ఐస్ క్రీమ్ 2 సినిమాతో రాబోతున్న వర్మ.....దీని తర్వాత సంపూర్ణేష్ బాబుతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం సంపూర్ణేష్ బాబు కొబ్బరి మట్ట, సింగం 123 సినిమాల్లో నటిస్తున్నారు. కరీంనగర్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ప్లాన్ చేస్తున్న రామ్ గోపాల్ వర్మ ‘తెలంగాణ ఉద్యమ పరిటిగడ్డ' కరీంనగర్ లో నవంబర్ 18వ తేదీ ఉదయం 11 గంటలకు శాతవాహన యూనివర్శిటీలోని ఒక బహిరంగ వేదిక ద్వారా ‘అవగాహన సదస్సు'ను ఏర్పాటు చేసి..‘హైదరాబాద్ సినిమా ఇండస్ట్రీలో పని చేసే ఒక్క వ్యక్తి కూడా తెలియకపోయినా, ఎలా కరీంనగర్ లోనే ఓ సినిమా ఇండస్ట్రీ పెట్టి మిగతా ప్రాంతాలతో ఏ మాత్రం సంబంధాలు లేకుండా, ఎవరి ప్రమేయం లేకుండా కూడా సినిమాలు తీసి వాటిని ఎలా రిలీజ్ చేయ్యచ్చో వివరిస్తానని ఆర్జీవి చెబుతున్నారు. కరీంనగర్ ఫిలిం ఇండస్ట్రీలో పాల్గొనడానికి ఆసక్తి ఉండి, కరీంనగర్ లో ఉన్నవాళ్లెవరైనా సరే ఈ నవంబర్ 18న మీటింగుకి రావచ్చని రామ్ గోపాల్ వర్మ పిలుపునిచ్చారు.
source:http://telugu.filmibeat.com/news/rgv-direct-sampoorneesh-babu-042160.html
0 comments:
Post a Comment