పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన మాజీ భార్య రేణు దేశాయ్ తన ఫేస్ బుక్ పేజీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసింది. అభిమానుల కోసం ఓ స్పెషల్ ఫోటో కూడా షేర్ చేసింది. చాలా కాలంగా మేము మంచి స్నేహితులం...ఇప్పటికీ మా మధ్య స్నేహం బలంగానే ఉంది...ఎప్పటికీ ఇలానే ఉంటుంది, హ్యాపీ బర్త్ డే అంటూ పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు తెలియజేసింది. ఈ సందర్భంగా ఇక్కడ కనిపిస్తున్న ఫోటోను పోస్టు చేసింది. ఈ ఫోటోను తనయుడు అకీరా తీసాడని రేణు దేశాయ్ తెలిపారు.
మరో ఆసక్తికర విషయం ఏమిటంటే...ఈ రోజు పవన్ పుట్టినరోజును పురస్కరించుకుని తన తొలి డైరెక్షనల్ వెంచర్ 'ఇష్క్ వాలా లవ్' టీజర్ విడుదల చేసింది రేణు దేశాయ్. పవన్ కళ్యాణ్ నాకు గురువు లాంటి వారని, ఆయన ద్వారానే సినిమా రంగానికి సంబంధించిన అనేక విషయాలు నేర్చుకున్నానని, తాను ఫిల్మ్ మేకర్‌గా మారడం వెనక ఆయన ప్రభావం బలంగా ఉందని రేణు పేర్కొన్నారు.
పవన్-రేణు ప్రయాణం
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన రేణు దేశాయ్ 2000 సంవత్సరంలో పార్థిబన్ హీరోగా తమిళంలో తెరకెక్కిన జేమ్స్ పాండు చిత్రం ద్వారా సినిమా రంగ ప్రవేశం చేసింది. అదే సంవత్సరం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ‘బద్రి' చిత్రంలో పవన్ సరసన నటించింది రేణు దేశాయ్. ‘బద్రి' సినిమా సమయంలోనే పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని, అదే వారి మధ్య ప్రేమకు బీజం పడింది. అలా పవన్ కళ్యాణ్ జీవితంలో రేణు దేశాయ్ ప్రవేశించింది.

పెళ్లి చేసుకోకుండానే ఇద్దరూ ఎంతో సంతోషంగా జీవనం సాగించారు. ఓ బిడ్డకు తల్లిదండ్రులయ్యారు. చిరంజీవి రాజకీయాల్లో ప్రవేశించడంతో పవన్-రేణు సంబంధంపై విమర్శలు వచ్చాయి. దీంతో పవన్ కళ్యాణ్-రేణు దేశాయ్ 2009లో పెళ్లాడక తప్పలేదు. సింపుల్‌గా వీరి పెళ్లి తంతు జరిగింది.
నటిగా కెరీర్‌కు ముగింపు చెప్పిన తర్వాత ఆమె పవన్ నటించిన ఖుషి, జానీ, గుడుంబా శంకర్, బాలు, అన్నవరం చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేసారు. తర్వాత ఆయనతో విడిపోయారు. పవన్ కళ్యాణ్ ద్వారా అకీరా, ఆద్యా అనే ఇద్దరు పిల్లకు తల్లయింది. ప్రస్తుతం మరాఠీ సినీ పరిశ్రమలో తన నిర్మాతగా, దర్శకురాలిగా ఎదిగే ప్రయత్నం చేస్తోంది రేణు దేశాయ్.
0 comments:
Post a Comment