Menu


ప్రిన్స్ మహేష్ బాబు నటించిన ఆగడు సినిమాలోని డైలాగులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రజలపై సినిమాల ప్రభావం ఎంత ఉంటుందో తెల్దు గానీ పంచ్ డైలాగుల ప్రభావం గట్టిగా ఉంది అని మహేష్ బాబు సినిమాలో చెప్పిన డైలాగ్ హల్‌చల్ చేస్తోంది. అలాగే ప్రతి ఓడు పులులు, సింహాలు, ఏనుగులు, ఎలుకలు అనడమే గానీ.. అంటూ చెప్పిన డైలాగు వివాదంగా మారే అవకాశం ఉందని అంటున్నారు. ఈ డైలాగు ఎవరిని ఉద్దేశించి కథారచయిత రాశాడు, మహేష్ నోట వినిపించారనేది చర్చనీయాంశంగా మారింది.


నిజానికి, మహేష్ బాబు రాజకీయాలకు దూరంగానే ఉంటున్నారు. కానీ, ఆగడు సినిమాలోని డైలాగుల్లో రాజకీయాలు కనిపిస్తున్నాయా అనే సందేహం వ్యక్తమవుతోంది. అలాగే, పంచ్ డైలాగుల విషయంలో ఆయన ఎవరిని ఉద్దేశించారనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు.. వాట్ టూ డూ వాట్ నాట్ టూ డూ అనే డైలాగ్‌కు కూడా హైప్ వచ్చింది. ఈ సినిమా ఆడియో శనివారంనాడు విడుదలైంది. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమానికి ప్రముఖ యాంకర్ ఝాన్సీ యాంకరింగ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ పెద్ద యెత్తున కార్యక్రమానికి వచ్చారు. మహేష్ బాబు రాజకీయాల్లోకి రారని యాంకర్ ఝాన్సీ వేదికపై నుంచి ప్రకటించారు. మహేష్ బాబు సూపర్ ఫ్యాన్ ఎంపిక కోసం నిర్వహించిన పోటీ సందర్భంగా ఆమె ఆ విషయం చెప్పారు. ఆగడు సినిమాలు సెప్టెంబర్ 19వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్రీను వైట్ల సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి అనిల్ సుంకర, రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మాతలు.


0 comments:

Post a Comment

 
Top